• తాజా వార్తలు

కేవ‌లం ఐదు సెక‌న్ల‌లో ఫేక్ మొబైల్ యాప్‌ల‌ను క‌నిపెట్ట‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్‌ల‌కు కొదువే లేదు. కుప్ప‌లు తెప్ప‌లుగా అనుక‌ర‌ణ యాప్‌లు వ‌చ్చేశాయి. అమాయ‌కుల‌ను బుట్ట‌లో వేయ‌డానికి ఎన్నో యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మ‌నం స‌రిగా ఆ యాప్ పేర్ల‌ను చూడ‌క‌పోతే మ‌న మొబైల్స్ స్పామ‌ర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇటీవ‌లే ఫేక్ వాట్స‌ప్ యాప్ ఒక‌దాన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో క‌నుగొన్నారు. మ‌రి ఇలాంటి ఫేక్ యాప్‌ల‌ను మ‌నం గుర్తించి ప‌రిహ‌రించేది ఎలా?.. మీరేం చింతించ‌క్క‌ర్లేదు. కేవ‌లం ఐదు సెక‌న్ల‌లో ఫేక్ మొబైల్ యాప్‌ను గుర్తించే అవ‌కాశం ఉంది. అదెలాగంటే..

ఎందుకు డెవ‌ల‌ప‌ర్స్ ఫేక్ యాప్స్ త‌యారు చేస్తారు?
నిజానికి ఫేక్ యాప్‌లు ఒరిజిన‌ల్ యాప్ మాదిరిగా ప‌ని చేయ‌చ్చు. లేదా ప‌ని చేయ‌క‌పోవ‌చ్చు. అయితే  డెవ‌ల‌ప‌ర్స్ వీటిని సృష్టించ‌డానికి ఒకే ఒక్క కార‌ణం ఆదాయం. ఒరిజిన‌ల్ యాప్‌ల‌కు వ‌చ్చే భారీ ఆదాయంలో త‌మ‌కు కాస్త‌యినా రాక‌పోతుంద‌నే ఆలోచ‌న‌తోనే వీళ్లు ఈ యాప్‌ల‌ను త‌యారు చేస్తారు. ఇటీవ‌లే వాట్స‌ప్ యాప్‌ను అలాగే త‌యారు చేసి వ‌దిలారు. మిలియ‌న్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం మ‌రో విశేషం. దీంతో ఆ ఫేక్ యాప్ వ‌ల్ల డెవ‌లప‌ర్స్ బాగానే డ‌బ్బులు సంపాదించారు. దీన్ని గుర్తించే స‌మ‌యానికి చాలా ఆల‌స్యం అయింది.  వాళ్ల‌కు డ‌బ్బులు వ‌చ్చే మాట ప‌క్క‌న పెడితే మ‌న డివైజ్‌ల‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

పేరును జాగ్ర‌త్త‌గా చూడాలి
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేముందే మ‌నం అది న‌కిలీదా అస‌లైన‌దా అని గుర్తు ప‌ట్టాలంటే ముందుగా ఆ యాప్ పేరును జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. డెవ‌ల‌ప‌ప‌ర్స్ ఎక్కువ‌గా ఈ విష‌యంలోనే వినియోగ‌దారుల‌ను బోల్తా కొట్టిస్తారు. వాట్స‌ప్ అని ఒరిజిన‌ల్ పేరు ఉంటే వాటప్ అనే పేరుతో కూడా సృష్టిస్తారు. లొగో సేమ్ ఉండ‌డంతో జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోకుండానే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అందుకే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఒకే పేరుతో రెండు యాప్‌లు ఉంటే దాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి అప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి.

డెవ‌ల‌ప‌ర్ పేరు ప‌రిశీలించాలి
ప్ర‌తి యాప్‌కు డెవ‌ల‌ప‌ర్ పేరు ఉంటుంది. దాన్ని ఎవ‌రు త‌యారు చేశారో ఉంటుంది. ఈ వివ‌రాలు మ‌నం క్షుణ్నంగా చూడాలి. అప్పుడు మీరు ఫేక్ యాప్‌ల మాయ‌లో ప‌డే అవ‌కాశం లేదు.  క‌చ్చితంగా యాప్‌కు డెవ‌ల‌ప‌ర్ పేరు ఉంటుంది. ఒక‌వేళ ఆ పేరు లేకుండా ఉంటే క‌చ్చితంగా అది న‌కిలీ యాప్ అని నిర్దార‌ణ‌కు రావాలి.  అంతేకాదు యాప్ కామెంట్స్‌, రివ్యూలు ప‌రిశీలించినా చాలు. ఈ కొన్ని టిప్స్ సాయంతో మీరు సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఫేక్ యాప్ ప‌ని ప‌ట్టొచ్చు.

జన రంజకమైన వార్తలు