• తాజా వార్తలు
  •  

ప్లే స్టోర్‌లో ఉన్న ఫేక్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను గుర్తించ‌డం ఎలా?

ప్లేస్టోర్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు వంద‌ల‌కొద్దీ యాప్‌లు క‌నిపిస్తాయి. వాటిలో ఉత్త‌మ‌మైన‌వి ఏవో ఫేక్ ఏవో మ‌న‌కు తెలియ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు రేసింగ్ అని ప్లే స్టోర్‌లో సెర్చ్ చేస్తే వంద‌ల్లో ఫ‌లితాలు వ‌స్తాయి. అయితే వాటిలో ది బెస్ట్ ఏమిటో మ‌న‌కు తెలుసుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే చాలామంది కంటికి క‌నిపించే యాప్‌ల‌నే డౌన్‌లోడ్ చేసేస్తుంటారు. కానీ ఆ యాప్‌లలో చాలా యాప్‌లు ఫేక్ ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌కే ప్ర‌మాదం ఎదురు కావొచ్చు. మ‌రి ప్లే స్టోర్‌లో ఉన్న ఈ ఫేక్ యాప్‌ను క‌నిపెట్టి వాటిని డౌన్‌లోడ్ చేసుకోకుండా నివారించ‌డం ఎలా?

సెర్చ్ రిజ‌ల్ట్స్ జాగ్ర‌త్త‌గా చూడాలి
మ‌నకు కావాల్సిన యాప్‌ల గురించి ప్లే స్టోర్‌లో టైప్ చేసిన‌ప్పుడు చాలా సెర్చ్ రిజ‌ల్ట్స్ వ‌స్తాయి. అయితే సెర్చ్ చేసిన వెంట‌నే ఏదో ఒక‌టి మీ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది. ఆ వ‌చ్చిన ఫ‌లితాల‌ను నిశితంగా ప‌రిశీలించండి. ముఖ్యంగా  ఒకే ఐకాన్‌తో  ఏమైనా ఒక‌టికి రెండు యాప్‌లు క‌నిపిస్తున్నాయా  అనేది ప‌రిశీలించాయి.  ఎందుకంటే అక్క‌డే మీరు ఫేక్ యాప్‌ల‌ను ఫిల్ట‌ర్ చేసేయ‌చ్చు.  ఐకాన్‌లు రెండూ ఒకేలా ఉంటే.. దానికింద ఉండే పేరును ఒక‌సారి చూడాలి

యాప్ పేరు, డెవ‌ల‌ప‌ర్ చూడాలి
సెర్చ్ రిజల్ట్స్ వ‌చ్చిన వెంట‌నే  మ‌నం చూడాల్సింది యాప్ పేరుతో పాటు డెల‌వ‌ప‌ర్ ఎవ‌ర‌నేది ప‌రిశీలించాలి.  ఒక్కోసారి డెవ‌ల‌ప‌ర్ పేరు కూడా కాపీ కొట్టే అవ‌కాశాలున్నాయి. ఇలాంటప్పుడు యాప్ పేరును బ‌ట్టే మ‌నం నిజ‌మైందా కాదా అనే నిర్దారణ‌కు రావాలి. ఇటీవ‌ల వ‌చ్చిన స్విప్ట్ కీ యాప్ కూడా ఇదే కోవ‌కు చెందింది. అయితే దీన్ని కాపీ చేస్తూ స్విప్ట్ కీబోర్డ్ అనే మ‌రో యాప్  రంగంలోకి దిగింది. దీని డిజైన‌ర్  పేరు సూప‌ర్‌మాన్ అని క‌నిపిస్తుంది.  అంటే అది ప‌క్కా న‌కిలీ యాప్ అని అర్ధం. ఎందుకంటే  ఈ యాప్‌ను ఒరిజిన‌ల్‌గా డిజైన్ చేసింది మైక్రోసాఫ్ట్‌. ఇలాంటి ఫేక్ యాప్‌లు ప్లే స్టోర్‌లో కోకొల్ల‌లుగా ఉన్నాయి. 

డౌన్‌లోడ్ కౌంట్ చూడాలి
 ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేట‌ప్పుడు చెక్ చేయాల్సింది డౌన్‌లోడ్ నంబ‌ర్. సాధార‌ణంగా వాట్స‌ప్ లాంటి యాప్‌ల‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటారు. అందుకే ఈ యాప్‌ను క‌ళ్లు మూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసేట‌ప్పుడు ఇబ్బంది వ‌స్తుంది. అందుకే డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఎంత మంది డౌన్‌లోడ్ చేశారో చూడాలి. అంతేకాదు రివ్యూ కూడా చూడాలి. అంటే ఆ యాప్‌కు క‌స్ట‌మ‌ర్లు ఇచ్చిన రేటింగ్ ఎంతో చూసి అప్పుడు ఇన్‌స్టాల్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు