• తాజా వార్తలు

వాట్స‌ప్‌ ఫొటోలు, వీడియోలు ఆటో డౌన్‌లోడ్‌, సేవ్ అవకుండా ఆప‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

1.2 బిలియ‌న్లు!  ఏంటి ఇది అనుకుంటున్నారా? ప‌్ర‌పంచ వ్యాప్తంగా వాట్స‌ప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య‌.  ఈ నంబ‌ర్ రోజు  రోజుకీ ర్యాపిడ్‌గా పెరిగిపోతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటే చాలు అందులో క‌చ్చితంగా వాట్సప్ ఉండాల్సిందే. అంత‌గా అంద‌రికి చేరువైపోయింది ఈ సోష‌ల్ మీడియా యాప్‌. ఐతే వాట్స‌ప్‌తో ఎన్ని లాభాలున్నాయో అన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. మ‌న వాట్స‌ప్‌లో ఎన్నో గ్రూప్‌లు ఉంటాయి.  వంద‌లాది మంది స్నేహితులు ఉంటారు. వీళ్లంద‌రూ రోజూ ఎన్నో  వంద‌ల పోస్టులు పంపుతుంటారు. ఇవ‌న్నీమ‌న ఫోన్‌లో ఓపెన్ అయిపోతాయి. చాలా వీడియోలు, ఫొటోలు మ‌న‌కు తెలియ‌కుండానే డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. మ‌రి ఇలా డౌన్‌లోడ్ కాకుండా ఆప‌డం ఎలా?

ఆపండి ఇలా...
వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మీకు  అన్ని చాట్స్  ఉన్న విండో క‌నిపిస్తుంది. టాప్ రైట్‌లో ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్  చేయాలి. ఆ త‌ర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీడియా ఆటో డౌన్‌లోడ్  మీద ట్యాప్ చేయాలి.   ఇందులో మీకు మూడు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. సెల్యుల‌ర్ డేటా ఉప‌యోగించేట‌ప్పుడు, వైఫైతో క‌నెక్ట్ అయి ఉన్న‌ప్పుడు, రోమింగ్‌లో ఉన్న‌ప్పుడు అనే మూడు ఆప్ష‌న్ల‌ను మీరు చూస్తారు. ప్ర‌తి దాన్ని ట్యాప్ చేయాలి. ఆటో డౌన్‌లోడ్ ఆప్ష‌న్ మీద అన్ చెక్ చేయాలి. ఫొటోలు, ఆడియో, వీడియో అన్నిటి మీద అన్ చెక్ చేయాలి. అయితే ఇన్నిచేసినా కొన్ని ఫొటోలు మ‌న గ్యాల‌రీలో క‌నిపిస్తూ చాలా ఇరిటేష‌న్ తెప్పిస్తాయి.

గ్యాల‌రీలో ఫొటోలు సేవ్ కాకుండా ఆపండిలా..
ప్లే స్టోర్ నుంచి క్విక్‌పిక్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఆ త‌ర్వాత వాట్స‌ప్ మీడియా ఫోల్డ‌ర్ల కోసం వెత‌కాలి. సాధార‌ణంగా ఈ ఫోల్డ‌ర్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లో ఉంటుంది.  వాట్స‌ప్, మీడియా, వాట్స‌ప్ ఇమేజ‌స్‌, వాట్స ప్  మీడియా, వాట్స‌ప్ ఆడియో,  వాట్స‌ప్ ఆడియా ఇలా పాత్‌ను వెతుకుతూ వెళ్లాలి.  వాట్స‌ప్ ఇమేజస్ ఫోల్డ‌ర్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అలాగే వీడియోలు, ఆడియో ఫైల్స్‌పై కూడా ఇలాగే లాంగ్ ప్రెస్ చేయాలి.  ఈ మూడు ఫోల్డ‌ర్ల‌ను సెలెక్ట్ చేసిన త‌ర్వాత టాప్ రైట్ లో ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్  చేయాలి. ఆ త‌ర్వాత హైడ్‌ను ఎంచుకోవాలి.  ఇక గ్యాల‌రీలో ఇవి మీకు క‌నిపించ‌వు. కావాలంటే ఆ హిడెన్ ఫోల్డ‌ర్ల‌ను మ‌ళ్లీ మీరు బ‌య‌ట‌కు తెచ్చు కోవ‌చ్చు.

ఐఫోన్‌లో ఇలా..
వాట్స‌ప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి  డేటా స్టోరేజ్ యూసేజ్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. టాప్‌లో మీడియా ఆటో  డౌన్‌లోడ్ అనే ఆప్ష‌న్ మీకు క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత ఫొటోలు, వీడియా, ఆడియా, డాక్యుమెంట్ల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత నెవ‌ర్ అనే ఆప్ష‌న్‌ను చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్‌లో ఫైల్స్ మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోగ‌లుగుతారు.  మిగివ‌లన‌వి మీరు కోరుకుంటేనే డౌన్‌లోడ్ అవుతాయి.

జన రంజకమైన వార్తలు