• తాజా వార్తలు

మ్యాక్‌, క్రోమ్ ఓఎస్  డివైస్‌ల్లో   స్క్రీన్ షాట్ తీయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ  మ్యాక్ లేదా క్రోమ్ ఓఎస్‌లో  స్క్రీన్‌లో క‌నిపిస్తున్న‌దాన్ని క్యాప్చ‌ర్ చేయాల‌నుకుంటున్నారా? అయితే స్క్రీన్‌షాట్ తీసుకోండి.  ఎలాగో తెలుసుకోవాలంటే చ‌దవండి.  

మ్యాక్ ఓఎస్

మ్యాక్ ఓఎస్ లో స్క్రీన్‌షాట్ తీసుకోవ‌డానికి చాలా మార్గాలున్నాయి.

మ్యాక్ లో మొత్తం స్క్రీన్‌ను  స్క్రీన్‌షాట్  తీసుకోవాలంటే Shift+Command+3 (అంటే మూడింటినీ ఒకేసారి) బ‌ట‌న్స్ ప్రెస్ చేయాలి.  అప్పుడు స్క్రీన్‌షాట్ ఇమేజ్ డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ మీద సేవ్ అవుతుంది.

Command, Control, Shift, 3 బ‌ట‌న్స్ ఒకేసారి ప్రెస్ చేస్తే విండోస్ పాత ఓఎస్‌ల మాదిరిగా స్క్రీన్ కాపీ అయి ఎడిట‌ర్‌లో ఓపెన్ అవుతుంది. ఇక్క‌డ సేవ్ చేసుకోవ‌చ్చు.

మ‌రింత స్పెసిఫిక్ స్క్రీన్‌షాట్  కావాలంటే Command, Shift, 4 ఒకేసారి ప్రెస్ చేయాలి. సెల‌క్ష‌న్ టూల్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఏరియా వ‌ర‌కు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ ఏరియా మొత్తం బ్లూ స్క్రీన్‌లోకి మారుతుంది. స్పేస్‌బార్‌ను ప్రెస్ చేస్తే సెలెక్ట్ చేసింది సేవ్ అవుతుంది.  Escape క్లిక్ చేస్తే సెల‌క్ష‌న్ చేసింది క్లియ‌ర్ అయి తిరిగి డెస్క్‌టాప్ మీదికి తీసుకెళుతుంది.

క్రోమ్ ఓఎస్‌

* స్టాండ‌ర్డ్ క్రోమ్ బుక్‌లో   Print Screen బ‌ట‌న్ ఉండ‌దు.   స్క్రీన్‌షాట్ తీసుకోవాలంటే Ctrl బ‌ట‌న్‌ను హోల్డ్ చేసి Switch Window buttonను ప్రెస్ చేయాలి. మీ క్రోమ్ బుక్ డెస్క్‌టాప్ ఫుల్ స్క్రీన్‌షాట్ క్రోమ్‌బుక్ డౌన్లోడ్ ఫోల్డ‌ర్‌లో సేవ్ అవుతుంది.

* స్టాండ‌ర్డ్ కీబోర్డ్‌తో క్రోమ్ బుక్ వాడుతుంటే Ctrl+F5 ప్రెస్ చేయాలి.   స్క్రీన్‌షాట్ తీయ‌గానే కింద రైట్ కార్న‌ర్‌లో నోటిఫికేష‌న్ వ‌స్తుంది. కాంటెక్స్‌టువ‌ల్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేసి  స్క్రీన్‌షాట్ ను కాపీ చేయాలి. Ctrl+V ప్రెస్ చేసి దీన్ని ఇమేజ్ ఎడిట‌ర్‌లో పేస్ట్ చేసి స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేసుకోవ‌చ్చు.

* క్రోమ్ ఓఎస్‌లో పార్షియ‌ల్ స్క్రీన్‌షాట్ టూల్ కూడా ఉంది.  Ctrl+Shift+Switch Windowని హోల్డ్ చేయాలి.  సెలెక్ష‌న్ టూల్‌ను క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. మౌస్ బ‌ట‌న్‌ను రిలీజ్ చేయ‌గానే మీరు సెలెక్ట్ చేసినంత వ‌ర‌కు స్క్రీన్‌షాట్‌ ఇమేజ్ డౌన్‌లోడ్ ఫోల్డ‌ర్‌లో సేవ్ అవుతుంది. 

జన రంజకమైన వార్తలు