• తాజా వార్తలు
  •  

షియోమి ఫోన్ రిపేర్ స్టేట‌స్ ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా? 

శాంసంగ్‌తో క‌లిసి ఇండియాలో టాప్ సెల్లింగ్ మొబైల్ కంపెనీగా నిల‌బ‌డింది షియోమీ. యూజ‌ర్ బేస్‌తోపాటు ఫోన్ రిపేర్లు కూడా షియోమీలో బాగానే పెరిగాయి. ఏ ఎంఐ స‌ర్వీసు సెంట‌ర్‌కు వెళ్లినా క‌స్ట‌మ‌ర్లు కిట‌కిట‌లాడుతూనే క‌నిపిస్తున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో షియోమి క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌పైనా శ్ర‌ద్ధ పెంచుతోంది. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన షియోమి ఇప్పుడు  ఫోన్ స‌ర్వీస్‌కి ఇచ్చాక స్టేట‌స్ ఏమిటో కూడా ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకునే సౌక‌ర్యాన్ని తీసుకొచ్చింది. 
రిపేర్ స్టేట‌స్ ఆన్‌లైన్‌లో తెలుసుకోవాలంటే.. 
ఇది చాలా సింపుల్ ప్రాసెస్‌. షియోమి అఫీషియ‌ల్ డివైస్ రిపేర్ పోర్ట‌ల్‌లోకి వెళ్లాలి. 
* మీ కాంటాక్ట్ నెంబ‌ర్‌, షియోమి వెబ్‌సైట్ నుంచి కొంటే ఆర్డ‌ర్ నెంబ‌ర్‌, స‌ర్వీస్ నెంబ‌ర్‌, ఐఎంఈఐ నెంబ‌ర్ లేదా సీరియ‌ల్ నెంబ‌ర్ ఉండాలి.
* ఈ డిటెయిల్స్‌ను అక్క‌డ ఎంట‌ర్ చేసి కన్ఫ‌ర్మ్ బ‌ట‌న్ ప్రెస్ చేయాలి. 
* ఇప్పుడు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.  దాన్ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ బ‌ట‌న్ ప్రెస్ చేయాలి.
* ఇప్పుడు వెబ్‌సైట్ మీ ఫోన్ రిపేర్ పేజ్‌లోకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్క‌డ మీకు ‘Order Status’, ‘Service Type’, ‘Service Center’ code అన్నీ ఉంటాయి. దీనిలో Order Statusను క్లిక్ చేయాలి. 
* ‘Ready for Delivery’ అని క‌నిపిస్తే మీ ఫోన్ రిపేర్ పూర్త‌యిన‌ట్టే. మీరు స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి పిక‌ప్ చేసుకోవ‌చ్చు.  
* ‘Work in Progress’ అని ఉంటే మీ ఫోన్ ఇంకా రిపేర్ చేస్తున్న‌ట్లు.  
* ‘Under Inspection’ అని క‌నిపిస్తే మీ ఫోన్‌లో ప్రాబ్లం ఏమిటో క‌నిపెడుతున్నార‌ని అర్ధం.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు