• తాజా వార్తలు

పేటీఎం నుంచి  బ్యాంకు అకౌంట్‌కి మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

పేటీఎం...పేటీఎం.. డిజిట‌ల్ లావాదేవీలు ఎక్కువైపోయిన త‌రుణంలో అంద‌రికి చేరువైపోయింది ఈ  ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌.. ముఖ్యంగా డీమానిటైజేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత  పేటీఎం ప్రాముఖ్య‌త బాగా పెరిగిపోయింది. ఏ లావాదేవీల‌కైనా పేటీఎంనే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు దీన్ని బాగా ఉప‌యోగిస్తున్నారు.   చివ‌రికి టీ షాపు వాళ్లు, క‌ర్రీ పాయింట్స్ వాళ్లు కూడా పేటీఎం బాట ప‌ట్టారు. అయితే పేటీఎంలో డ‌బ్బులైతే వ‌స్తాయి కానీ వాటిని తిరిగి మ‌న బ్యాంకు అకౌంట్‌లోకి మ‌ళ్లించ‌డం ఎలా?

ట్రాన్స‌ఫ‌ర్‌కు ఓ లిమిట్ ఉంది
పేటీఎం నుంచి డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేయాలంటే దానికో లిమిట్ ఉంటుంది.  వ్యాపారుల కోసం రూ.50 వేల వ‌ర‌కు అదే  సాధార‌ణ వ్య‌క్తుల‌కు రూ.20 వేల వ‌ర‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే పేటీఎంలో మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవాలంటే ముందుగా కేవైసీ  చేసుకోవాలి.  కేవైసీ (నో యువ‌ర్ కస్ట‌మ‌ర్‌) చేయాలంటే మీరు ప్ర‌భుత్వం ఆమోదించిన పాస్‌పోర్ట్‌, వోట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు కావాలి. పాన్‌కార్డు మ‌స్ట్  కాదు. అయితే కేవైసీ పూర్తి చేసిన త‌ర్వాతే మ‌నం లావాదేవీలు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అవ‌స‌ర‌మైతే మీరు మీ ద‌గ్గర్లోని పేటీఎం కేవైసీ సెంట‌ర్‌కు వెళ్ల‌డం లేదా.. ఆన్‌లైన్ ద్వారా అప్ల‌యి్ చేయ‌డ‌మో చేయ‌చ్చు.

మ‌నీ  పంపించ‌డం ఇలా..
కేవైసీ పూర్త‌యిన త‌ర్వాత త‌ర్వాత స్టెప్ మ‌నీ పంపించుకోవ‌డ‌మే. దీనికోసం  మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయాలి.

అందులో పాస్‌బుక్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి.  ఆపై సెండ్ మ‌నీ టు బ్యాంకు ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

ఆ త‌ర్వాత  ట్రాన్స‌ఫ‌ర్ ఆప్ష‌న్ క్లిక్ చేసుకోవాలి.  ఆ పై అమౌంట్‌, అకౌండ్ హోల్డ‌ర్ పేరు,  బ్యాంకు అకౌంట్ నంబ‌ర్‌, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంట‌ర్ చేయాలి.

ఆపై సెండ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే చాలు. పేటీఎంలో మ‌నీ మీరు కోరుకున్న అకౌంట్‌కు బ‌దిలీ అయిపోతాయి.

డెస్క్‌టాప్ నుంచి ఎలా చేసుకోవాలంటే...

డెస్క్‌టాప్‌లో పేటీఎం.కామ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి లాగిన్ చేయాలి

టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న పేటీఎం వాలెట్‌ను క్లిక్  చేయాలి

ఆ విండోలో మీరు ట్రాన్స‌ఫ‌ర్ టు బ్యాంకు ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

ఆపై సెండ్ మ‌నీ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.
 
పేటీఎంకు మీరు కొత్త‌యితే మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేసుందుకు కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే  కేవైసీ అప్రూవ్ కావ‌డానికి కాస్త స‌మ‌య ప‌డుతుంది. ఒక‌సారి అప్రూవ్ అయిన త‌ర్వాత మీరు లావాదేవీలు సాగించొచ్చు.                                    

జన రంజకమైన వార్తలు