• తాజా వార్తలు
  •  

పాన్ కార్డ్ డిటైల్స్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా? 

ఆర్థిక లావాదేవాల‌న్నింటికీ పాన్ కార్డ్ అత్య‌వ‌సరం. ఇది వ‌ర‌కు బ్యాంకులో 50వేల‌కు  పైన డిపాజిట్‌చేయాల‌న్నా, విత్ డ్రా చేయాల‌న్నా పాన్ కార్డ్ నెంబ‌ర్ అడిగేవారు. ఇప్పుడుచాలా చోట్ల జీరో బ్యాల‌న్స్ అకౌంట్ల‌కు కూడా పాన్‌కార్డ్ లింక్ చేయాల్సిందేన‌ని చెబుతున్నారు. టూ వీల‌ర్ నుంచి హోమ్ లోన్ వ‌ర‌కు ఏ ర‌క‌మైన లోన్ తీసుకోవాల‌న్నా పాన్ కార్డ్  త‌ప్ప‌నిస‌రి. కానీ పాన్ కార్డ్‌లో ఏదైనా త‌ప్పు ఉంటే ఆ ప్రాసెస్ అంతా త‌ల‌నొప్పిగా మారుతుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. అదెలాగో చూడండి. 

మీ పేరులోగానీ, డేట్ ఆఫ్ బ‌ర్త్‌,  అడ్ర‌స్‌లో ఏమైనా త‌ప్పుగా న‌మోదైతే వెంట‌నే దాన్ని స‌రిచేసుకోవ‌డం మంచిది. అంతేకాదు కొంత‌మంది పెళ్ల‌య్యాక పేరు మార్చుకుంటారు.  ఇలాంటివారు కూడా కావాలంటే దాన్ని అఫీషియ‌ల్‌గా పాన్ కార్డ్‌లో మార్చుకోవ‌చ్చు. అయితే ఆధార్ కార్డ్‌లో  క‌రెక్ట్ పేరు ఉంటే ఆధార్ ఈకేవైసీ ద్వారా మీ పాన్ కార్డ్‌లో కూడా స‌రిచేసుకోవ‌చ్చు.  ఆధార్ కార్డులో కూడా స‌రిగా లేక‌పోతే మీ పేరు మార్చుకున్న‌ట్లు అఫీషియ‌ల్ గెజిట్‌లో ఉన్న వివ‌రాలుగానీ, మ్యారేజ్ స‌ర్టిఫికెట్ లేదా పెళ్లి శుభ‌లేఖ వంటివి ఏవైనా స‌బ్మిట్ చేయ‌వ‌చ్చు.  పాస్‌పోర్టులో క‌రెక్ట్ నేమ్ ఉంటే అద‌యినా స‌రిపోతుంది. 
 

ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసి రీప్రింట్ చేయాలంటే..
1. NDSL వెబ్‌సైట్‌కు వెళ్లండి.Application Typeలో ఉన్న‌Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card (No changes in existing PAN Data)ను సెలెక్ట్ చేయండి. 
2. మీ డిటెయిల్స్ నింపి captcha కోడ్ ఎంట‌ర్ చేసి సబ్మిట్ కొట్టండి.
3. త‌ర్వాత స్టెప్‌లో మీరు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాల‌నుకుంటున్నార‌ని అడుగుతుంది. ఆధార్ ఈకేవైసీ అయితే రెడ్ మార్స్స్ ఉన్న చోట మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని నింపి నెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు నింపేదంతా ఆధార్ కార్డ్‌లో ఉన్న‌ట్లుగానే ఉండాలి.  త‌ప్పు కొడితే ఆధార్ ఈకేవైసీ పూర్త‌వదు.
4. ఇప్పుడు మీరు అప్లికేష‌న్‌తోపాటు సబ్మిట్ చేయాల‌నుకుంటున్న డాక్యుమెంట్స్ ఏమిటో సెలెక్ట్ చేయాలి. ఈకేవైసీ క్లిక్ చేసి, డిటెయిల్స్ ఫిల్ చేశారు కాబ‌ట్టి ప్రొసీడ్ బ‌ట‌న్ నొక్కండి.
5. రివిజ‌న్ లేదా రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్‌కు 120 రూపాయ‌ల వ‌ర‌కు ఛార్జి ఉంటుంది. అదే ఇండియా బ‌య‌ట ఉన్న‌వారికి అయితే 1,040రూపాయ‌ల వ‌ర‌కు ఛార్జి వేస్తారు. Payను క్లిక్ చేసి క‌న్ఫ‌ర్మ్‌చేయండి.
6. మీ పేమెంట్ డిటెయిల్స్ ఎంట‌ర్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయండి.  మీ ట్రాన్సాక్ష‌న్ స‌క్సెస్‌ఫుల్ అయిన‌ట్లు వ‌స్తుంది. త‌ర్వాత బ్యాంక్ రిఫ‌రెన్స్ నెంబ‌ర్‌, ట్రాన్సాక్ష‌న్ నెంబ‌ర్ వ‌స్తుంది. వీటిని సేవ్ చేసి  Continueను క్లిక్ చేయండి.
7. మీ ఆధార్ నెంబ‌ర్‌తో అథెంటికేట్ చేయాలి. మీ ఆధార్ నెంబ‌ర్ కింద ఉన్న బాక్స్‌లో టిక్ చేసి Authenticateను క్లిక్ చేయండి.
8. మీ డిటెయిల్స్ ఆధార్ కార్డ్‌లో ఉన్న డిటెయిల్స్‌తో స‌రిపోతే Continue with e-Sign / e-KYCని క్లిక్ చేయండి.
9.చెక్ బాక్స్‌ను టిక్ చేసి  Generate OTPని క్లిక్ చేయండి.
10. ఓటీపీ ఎంట‌ర్ చేసి సబ్మిట్ కొట్టండి.

మీ అప్లికేష‌న్ స‌బ్మిట్ అయింది.  దీన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. మీ ఈమెయిల్‌కు ఒక ఎక‌నాలెడ్జ్‌మెంట్ కూడా వ‌స్తుంది.మీ అప్లికేష‌న్ ప్రాసెస్ అయ్యాక‌, మార్చిన వివ‌రాల‌తో కొత్త పాన్ కార్డ్ నేరుగా మీ అడ్ర‌స్‌కే వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు