• తాజా వార్తలు

ఆధార్ సైట్‌లో మీ ఫోన్ నెంబ‌ర్ వెరిఫై చేసుకోవ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ ఆధార్ కార్డ్ కోసం మీరు UIDAIకి ఇచ్చిన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌రెక్ట్‌గా ఉందా? అని తెలుసుకోవాలంటే UIDAI  వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి.  ప్ర‌తి చిన్న‌ప‌నికీ ఆధార్‌తో లింక‌యి ఉన్న ప‌రిస్థితుల్లో మీ ఆధార్ ఇన్ఫో క‌రెక్ట్‌గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌, మొబైల్ నెంబ‌ర్‌, ఇలా అన్నింటికీ ఆధార్ తో లింక‌ప్ త‌ప్ప‌నిస‌రి అయింది.  UIDAI ఈ వెరిఫికేష‌న్ కోసం ఆన్‌లైన్‌లో స‌ర్వీస్ తీసుకొచ్చింది. కాబ‌ట్టి ఆధార్ రికార్డ్స్‌లో మీ  మెయిల్ ఐడీ, మొబైల్ నెంబ‌ర్ వంటి ఇంపార్టెంట్ ఇన్ఫో క‌రెక్ట్‌గా ఉందో లేదో తెలుసుకోవ‌డానికి ఈ వెరిఫికేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా చేసుకోవాలి. 

ఈమెయిల్‌ అడ్ర‌స్‌ను ఎలా ఈ-వెరిఫై చేసుకోవాలి? 
* UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి  Aadhaar Services ట్యాబ్‌ను ట్యాప్ చేయాలి.  
* Verify Email/Mobile Number ను క్లిక్ చేయాలి. 
* ఈ మెయిల్ అడ్ర‌స్‌ను వెరిఫై చేయ‌డానికి ఆధార్ నెంబ‌ర్‌, ఈమెయిల్ అడ్ర‌స్‌, సెక్యూరిటీ కోడ్ ఎంట‌ర్ చేయాలి. UIDAI సెక్యూరిటీ కోడ్  కేస్ సెన్సిటివ్. కాబ‌ట్టి క్యాపిట‌ల్ లెట‌ర్స్‌, స్మాల్ లెట‌ర్స్ క‌రెక్ట్‌గా చూసుకుని ఎంట‌ర్ చేయాలి.  
* ఇప్పుడు మీరు ఎంట‌ర్ చేసిన మెయిల్ అడ్ర‌స్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని వెరిఫికేష‌న్ పేజీ రైట్‌సైడ్‌లో ఇచ్చిన స్పేస్‌లో ఎంట‌ర్ చేయాలి. 
* మీ వివరాల‌న్నీ క‌రెక్ట్‌గా ఉండి మ్యాచ్ అయితే "Congratulations! The Email ID matches with our records! అని మెసేజ్ వ‌స్తుంది.


మొబైల్ నెంబ‌ర్‌ను ఎలా ఈ-వెరిఫై చేసుకోవాలి? 
* UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి  Aadhaar Services ట్యాబ్‌ను ట్యాప్ చేయాలి.  
* Verify Email/Mobile Number ను క్లిక్ చేయాలి. 
* మొబైల్ నెంబ‌ర్‌ను వెరిఫై చేయ‌డానికి మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి 
* ఇప్పుడు మీ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని వెరిఫికేష‌న్ పేజీ రైట్‌సైడ్‌లో ఇచ్చిన స్పేస్‌లో ఎంట‌ర్ చేయాలి. 
* మీ వివరాల‌న్నీ క‌రెక్ట్‌గా ఉండి మ్యాచ్ అయితే Congratulations! The Mobile Number matches with our records! అని మెసేజ్ వ‌స్తుంది.
 

జన రంజకమైన వార్తలు