• తాజా వార్తలు
  •  

మీ ఆధార్ అడ్రస్ ను ఆన్ లైన్ లో మార్చుకోవడం ఎలా?

ఈ రోజుల్లో ఆధార్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. ప్రతీ చిన్నవిషయానికీ ఆధార్ అడుగుతూ ఉండడం తో ఇది లేకుండా పనులు జరగడం కష్టం అయింది,  ఆధార్ ఎంత ముఖ్యమో అందులో ఉండే మన వివరాలు సరిగ్గా ఉండడం కూడా అంతే ముఖ్యం. అంటే ఆధార్ కార్డు మీద ఉండే మన పేరు, చిరునామా తదితర వివరాలన్నీ సరిగ్గా ఉండాలి. అయితే చాలా మంది తమ పర్మినేంట్ అడ్రస్ తో కాకుండా తాత్కాలిక అడ్రస్ మీద ఆధార్ ను తీసుకుని ఉంటారు.దానిమీద మీ శాశ్వత చిరునామా లేకపోతే చాలా  సందర్భాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మీ ఆధార్ కార్డు లో ఉన్న తప్పుడు చిరునామా ను మార్చుకోవాలి. మరి దీనిని మార్చుకోవడం ఎలా? ఏముంది మీసేవ ల చుట్టూ తిరగాలి, అక్కడ ఉండే పెద్ద పెద్ద క్యూ లైన్ లలో నిలబడి సరిచేసుకోవాలి కదా! ఇకపై ఈ బాధ అవసరం లేదు. ఆన్ లైన్ లో కూడా మీరు మీ ఆధార్ లోని అడ్రస్ ను మార్చుకునే విధానాన్ని UIDAI ప్రవేశపెట్టింది. అదెలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఆధార్ అడ్రస్ ను ఆన్ లైన్ లో మార్చుకోవడం ఎలా ?

కొన్ని స్టెప్ లను ఫాలో అవడం ద్వారా UIDAI  వెబ్ సైట్ నుండి చాలా సులువుగా  మీ ఆధార్ లోని అడ్రస్ ను మార్చుకోవచ్చు.

  1. UIDAI వెబ్ సైట్ ఓపెన్ చేసి అడ్రస్ అప్ డేట్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయాలి. మరొక ట్యాబ్ లో ఒక కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న సూచనలను చదివి క్రింద ఉన్న ప్రొసీడ్ అనే దానిపై క్లిక్ చేయాలి.
  2. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక otp వస్తుంది. తర్వాతి పేజి లో ఆ otp ని ఎంటర్ చేయాలి.
  3. ఆ తర్వాత మీరు మీ అడ్రస్ ను ఏ విధంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో అడుగుతుంది. దానిని సెలెక్ట్ చేయాలి.
  4. తర్వాతి పేజి లో మీ అడ్రస్ మార్పు కు సంబందించిన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  5. ఇప్పుడు మీ అడ్రస్ ప్రూఫ్ యొక్క డాక్యుమెంట్ లలో ఏదో ఒక దానిని అప్ లోడ్ చేయాలి. పాస్ పోర్ట్, ఇన్సురెన్స్ పాలసీ. క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్, టెలి ఫోన్ బిల్, ఆస్తి పన్ను రసీదు లాంటివి ఏదైనా అడ్రస్ ప్రూఫ్ లాగా వాడుకోవచ్చు.
  6. చివరి స్టెప్ BPO సర్వీస్ ప్రొవైడర్ ను సెలెక్ట్ చేసుకోవడం. అక్కడ ఉన్న వివిధ సర్వీస్ ప్రొవైడర్ లలో ఎదో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని దాని ప్రక్కనే ఉన్న రేడియో బటన్ ను క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైక్లిక్ చేయాలి.
  7. అంతే మీ అడ్రస్ మారినట్లే. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే మీ అదార్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి.

జన రంజకమైన వార్తలు