• తాజా వార్తలు
  •  

ఏమిటీ ఆండ్రాయిడ్ సీమ్‌లెస్ అప్‌డేట్స్‌.. మ‌న ఫోన్ స‌పోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

ఇటీవ‌లే గూగుల్ సీమ్‌లెస్ అప్‌డేట్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగ‌ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ద్వారా ఇది ల‌భ్యం అవుతోంది. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను  ఏ, బీ అనే రెండు భాగాలుగా విభ‌జించారు. ఇది స్లాట్ ఏ, స్లాట్ బి అనే పేరుతో రెండు భాగాలుగా ఉంటాయి. అప్‌డేట్స్ అన్ని ఇన్ యాక్టివ్ స్లాట్లో డౌన్‌లోడ్ అవుతాయి. యూజ‌ర్ డివైజ్‌లో ఇన్‌స్టాలేష‌న్ చేయ‌గానే రీబూట్ కాగానే.. ఇన్ యాక్టివ్ మోడ్‌లో సీమ్‌లెస్ అప్‌డేట్స్ అన్ని డౌన్‌లోడ్ అవుతాయి. ఆ త‌ర్వాత యూజ‌ర్ డేటా రెండు భాగాలుగా విభ‌జ‌న అవుతుంది. 

రెండు స్లాట్ల ద్వారా..

ఏ, బీ పార్టిష‌న్స్ ద్వారా వేర్వేరు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రధాన‌మైన ఉప‌యోగం ఏమిటంటే అప్‌డేట్స్ ప్రాసెస్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక‌వేళ అప్‌డేట్స్ స‌రిగా ఇన్‌స్టాల్ కాక‌పోతే..ఈ డివైజ్ ఆటోమెటిక్‌గా వేరే స్లాట్‌లోకి మారిపోతుంది. అంతేకాదు బూటింగ్ స‌మ‌యంలో జ‌రిగే ఎర్ర‌ర్స్‌ను కూడా ఏ, బీ పార్టిష‌న్స్ ద్వారా నివారించొచ్చు. ఒక‌వేళ అప్‌డేట్స్ బి స్లాట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్‌స్టాల్ అయితే...ఆ త‌ర్వాత డివైజ్ ఆటోమెటిక్‌గా ఎ-స్లాట్‌లోకి స్విచ్ అవుతుంది. దీనిలో ఉన్న మ‌రో ఉప‌యోగం ఏమిటంటే స్క్రీన్ మీద యూజ‌ర్లు ఆండ్రాయిడ్ ఈజ్ అప్‌గ్రేడింగ్ అనే మెసేజ్ ఎక్కువసేపు చూడ‌క్క‌ర్లేదు. అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ అయిన త‌ర్వాత డివైజ్ ఆటోమెటిక్‌గా రీబూట్ అయిపోతుంది.

ఇబ్బందులూ ఉన్నాయి
ఏ, బీ పార్టిష‌న్స్ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఏమిటంటే ఇది సిస్ట‌మ్ స్టోరేజ్‌ను బాగా వాడుకుంటుంది. రెండు సెట్లుగా అప్‌డేట్స్ చేయ‌డం వ‌ల్ల చాలా స్పేస్ ఖ‌ర్చు అవుతుంది. అయినా కూడా చాలా స్మార్ట్‌ఫోన్ మేక‌ర్స్ రెండు వే పార్టిష‌న్ సిస్ట‌మ్‌ను ఉపయోగిస్తున్నారు. త‌మ డివైజ్ ఏ, బీ సీమ్‌లెస్ అప్‌డేట్స్‌కు స‌హ‌క‌రిస్తుందో లేదో తెలుసుకోవ‌డం కూడా సుల‌భం. దీని కోసం టెర్మిన‌ల్ ఎమ్యులేట‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇదే కాక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రెబుల్ చెక్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకుని చెక్ చేసుకునే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు