• తాజా వార్తలు

మీకు ఇష్టమైన పాటల కరోకే వెర్షన్ క్రియేట్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీకు సంగీతం అంటే ఇష్టమా? కరోకే మ్యూజిక్ గురించి మీలో ఎంత మందికి అవగాహన ఉంది? అసలు కరోకే వెర్షన్ అంటే ఏమిటి? అచ్చ తెలుగు లో చెప్పుకోవాలంటే కరోకే అంటే కచేరి అని అర్థం . వాస్తవానికి ఇది ఒక జపాన్ కు చెందిన సంగీత అంశం. వివిధ రకాల ఫేవరెట్ పాటలను లైవ్ ప్రదర్శన లాగా ఇవ్వడం అన్నమాట. ఒక్కమాటలో చెప్పుకోవాలి అంటే కేవలం సంగీత వాయిద్య పరికరాల సహాయం తోనే వీనుల విందైన సంగీతాన్ని అందించడం అన్నమాట. అయితే మీకు నచ్చిన పాటలను ఈ కరోకే వెర్షన్ లోనికి మార్చడం ఎలా? అనే విషయం గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

మీరు ఇకపై మీకు నచ్చిన పాటలను కరోకే వెర్షన్ లోనికి మార్చుకోవచ్చు. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ సహాయం తో మీరు వోకల్స్ ఫ్రీ కరోకే ఫైల్ ను జిప్ ఫైల్ రూపం లోనికి మార్చుకుని వినవచ్చు.అది ఎలాగో చూద్దాం. ఈ ప్రక్రియ లో ఉన్న వెబ్ సౌకర్యాన్ని ఫోనిక్ మైండ్ అని అంటారు. ఇది ఆడియో ఫైల్ లను ఇన్ పుట్ గా తీసుకుని, కొన్ని మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ల ద్వారా ఆ ఫైల్ లో ఉన్న వోకల్ లను వేరు చేసి రెండు అవుట్ పుట్ లను విడుదల చేస్తుంది. ఆ ఫైల్ లో ఉండే వెర్బల్ ( మాటలు ) మరియు సంగీతం వేరు చేయబడుతుంది. అలా వేరు చేయబడిన మ్యూజిక్ ఫైల్ నే కరోకే ఫైల్ అంటారు.

ఈ ప్రక్రియ ఎలా ?       

మొదటగా ఫోనిక్ మైండ్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉండే ట్రై ఇట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

మీ కంప్యూటర్ లో ఉండే ఆడియో ఫైల్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. అయితే ఆ ఫైల్ సైజు 30 MB ని మించకూడదు.

ఇది వివిధ రకాల ఫార్మాట్ లైన .mp3,.aac , .wma మరియు .flc లను సపోర్ట్ చేస్తుంది.

ఇలా అప్ లోడింగ్ చేయడం పూర్తీ అయిన తర్వాత కొన్ని క్షణాల పాటు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ సమయం లో AI తన అత్యుత్తమ అవుట్ పుట్ ను అందిస్తుంది.

ఇక్కడ మీకు రెండు రకాల ఆప్షన్ లు కనిపిస్తాయి. ఆ రిజల్ట్ ను ప్రివ్యూ చూడవచ్చు లేదా 30 సెకన్ల ట్రయిల్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీకు పూర్తి సంతృప్తి గా అనిపించినట్లయితే పూర్తి కరోకే ఫైల్ ను 2 డాలర్లు చెల్లించడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఫోనిక్ మైండ్ ను మీరు మళ్ళీ మళ్ళీ ఉపయోగించాలి అనుకుంటే ప్రీమియం ప్యాకేజ్ ను తీసుకోవడం ఉత్తమం. దీనిద్వారా మీరు ఒక్కో పాటకు నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పొందుతారు. అంతేగాక ఇది మీ ట్రాక్ లను ఆన్ లైన్ లో కూడా భద్రపరుస్తుంది.

 

జన రంజకమైన వార్తలు