• తాజా వార్తలు
  •  

గూగుల్ అకౌంట్ డిలీట్ అవ్వకుండా...గూగుల్ ప్లస్ అకౌంట్ ను డిలీట్ చేయడం ఎలా?

గూగుల్ ప్లస్ అకౌంట్ తో మీకు పనిలేదా? అయితే డిలీట్ చేయండి. జి-మెయిల్ అకౌంట్ డిలీట్ అవ్వకుండా...గూగుల్ ప్లస్ అకౌంట్ ను డిలీట్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసేయొచ్చు.

 
జి-మెయిల్ ను డిలీట్ చేయకుండా...గూగుల్ ప్లస్ అకౌంట్ ను డిలీట్ చేయండి.

గూగుల్ ప్లస్ అకౌంట్‌ను డిలీట్ చేస్తే...ఈ క్రింది విషయాలు కూడా డిలీట్ అవుతాయాని తెలుసుకోండి.

·       మీరు క్రియేట్ చేసిన అన్ని సర్కిల్లు డిలీట్ అవుతాయి.

·       All+1 మోడ్/డన్

·       పబ్లిష్ చేసిన పోస్టులు, కామెంట్స్, కలెక్షన్స్ అన్నికూడా డిలీట్ అవుతాయి.

·       హ్యాంగ్ అవుట్స్, గూగుల్ టాక్, జిమెయిల్ లోని అన్ని చాట్ కంటెంట్ కూడా అటోమెటిగ్గా డిలీట్ అవుతుంది.

·       అంతేకాదు మీరు ఏ ఇతర వెబ్ సైట్ లోనైనా సరే గూగుల్ ప్లస్ షేరింగ్ బటన్‌ను ఉపయోగించలేరు. దీంతోపాటు ఇతర యాప్స్ కు ఉన్న కనెక్షన్ డిలీట్ అవుతుంది.

·       గూగుల్ ప్లస్ అకౌంట్ ను డిలీట్ చేసే ముందు...మీరు మొదట గూగుల్ ప్లస్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత...మీ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న సెట్టింగ్స్ ను చూస్తారు. ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి.

·       ఓపెన్ చేసిన తర్వాత...కిందకు స్క్రోల్ చేయండి. ఇక్కడ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ ను డిలీట్ చేసే ఆప్షన్‌ను చూస్తారు.

·       ఇప్పుడు మీ బ్రౌజర్లో మరోక ట్యాబ్‌ను ఓపెన్ చేస్తుంది. మళ్లీ మీరు పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

·       టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి...రెండు బాక్సులను చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్సులో టిక్స్ చేయండి. ఇప్పుడు డిలీట్ బటన్ పై క్లిక్ చేయండి.

·       ఇప్పుడు మీరు గూగుల్ ప్లస్ నుంచి ఎందుకు రిమూవ్ అవుతున్నారు అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవడానికి కావల్సిన పేజీకి వెళ్లాల్సి ఉంటుంది.

అంతే సింపుల్ మీ గూగుల్ ప్లస్ అకౌంట్ శాశ్వతంగా డిలీట్ అవుతుంది.

కానీ మీరు మరలా గూగుల్ ప్లస్ అకౌంట్లోకి చేరాలనుకుంటే...గూగుల్ ప్లస్ హోం పేజీని ఓపెన్ చేసి...గూగుల్ ప్లస్ బటన్‌లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాత చాట్స్ , సర్కిల్లను తిరిగి పొందలేరు...కానీ గూగుల్ ప్లస్ అకౌంట్‌ను మాత్రం ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.

జన రంజకమైన వార్తలు