• తాజా వార్తలు
  •  

గూగుల్ ఇమేజేస్ ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్  చేయడం ఎలా?

సాధారణంగా వెబ్ సైట్ల గ్యాలరీలోని ఫోటోలు, బంధుమిత్రుల ఫోటోలను మనీ పీసీలో సేవ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం?  ప్రతి ఫోటోను ఓపెన్ చేసి...ఇమేజ్ అనే ఆప్షన్ ఉపయోగించి సేవ్ చేస్తాం. ఒకటి, రెండు ఫోటోలు ఇలా సేవ్ చేసుకోవచ్చు. కానీ వందల సంఖ్యలో ఉన్న ఫోటోలను డౌన్ లోడ్ చేయాలంటే? మనకు ఓపికా ఉండదు...అంత టైమూ ఉండదు. ఇలాంటి స‌మ‌యాల్లో వాడుకోద‌గిన టిప్ ఇదిగో చూడండి..
ఒక్క‌ క్లిక్ చాలు
వందల సంఖ్యలో ఉన్న ఫోటోలను సేవ్ చేయడానికి  ఫైర్ ఫాక్స్‌లో ఒక్క క్లిక్‌తో గూగుల్ ఇమేజ్‌లు డౌన్‌లోడ్  చేసుకోవచ్చు. గూగుల్ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి మనకు కావాల్సిన అన్ని ఇమేజ్‌ల‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. JPG, PNG,GIF, SVG ఇలా అన్నింటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. URLను ఉపయోగించిన ఇమేజ్‌లు డౌన్‌లోడ్  చేసే సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. కానీ ఈ సాఫ్ట్‌వేర్ల ద్వారా గూగుల్ ఇమేజ్ రిజల్ట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసే వీలుండ‌దు. ఇలాంటి సందర్భాల్లో మీరు కొన్ని టూల్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది.  మీరు ఫైర్ ఫాక్స్ వాడుతుంటే  గూగుల్ ఇమేజ్ డౌన్‌లోడ‌ర్ యాడ్ ఆన్ ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు కావాల్సిన అన్ని ఇమేజ్‌ల‌ను పూర్తి రిజల్యూషన్‌తో డౌన్‌లోడ్ చేస్తుంది.
ఫైర్‌ఫాక్స్ నుంచి గూగుల్ ఫొటోస్ ఒక్క క్లిక్‌తో చేయ‌డం ఎలా?
గూగుల్ ఇమేజ్‌ల‌ను డౌన్‌లోడ‌ర్ ఉప‌యోగించి ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసే విధానం ఇదీ.. 
1.   మొదట గూగుల్ ఇమేజ్ డౌన్‌లోడ‌ర్ యాడ్ ఆన్  డౌన్‌లోడ్ చేసుకోని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
2.  ఇప్పుడు గూగుల్‌లో మీకు కావాల్సిన ఫొటోల‌ను సెర్చ్ చేయండి. సెర్చ్ లిస్టులో మీకు ఇమేజ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.  అన్ని ఇమేజేస్ ఒక క్లిక్ తోనే డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ ఇమేజ్ డౌన్ లోడర్ యాడ్ఆన్ అనే సింబల్ పై క్లిక్ చేయండి. 
3. డౌన్‌లోడ్ మేనేజర్‌లో  మీకు కావాల్సిన అన్ని ఇమేజేస్ డౌన్‌లోడ్ అవుతాయి. ఎక్కువ  ఫొటోలు ఉంటే ఎక్కువ టైం 
4. ఇలా గూగుల్ ఇమేజ్‌ల‌ను ఫైర్‌ఫాక్స్‌లో ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ఫైర్‌ఫాక్స్ కోసం గూగుల్ ఇమేజ్ డౌన్‌లోడ‌ర్ ప్ల‌గ్ ఇన్ సులభంగా డౌన్ లోడ్ చేస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ పేజీ నుంచి ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేస్తే మీకు కావాల్సిన ఇమేజ్‌ల‌న్నీ మీ పీసీలో సేవ్ అవుతాయి. .

జన రంజకమైన వార్తలు