• తాజా వార్తలు

టోటల్ వికీపీడియాని పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వికీపీడియా.. ఇంట‌ర్నెట్‌లో విజ్ఞాన స‌ర్వ‌స్వం.  అగ్గిపుల్ల నుంచి అణుబాంబు అన్నింటి గురించి బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇందులో ఉంటుంది. ఆ స‌మ‌చారం మొత్తాన్ని ఎక్స్‌ట‌ర్న‌ల్ స్టోరేజ్ డివైస్‌ల్లోకి  కాపీ చేసేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసాఅలా ఒక‌సారి కాపీ చేసుకుంటే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేక‌పోయినా మ‌న‌కు కావాల్సిన‌ప్పుడు ఆ ఇన్ఫోను వాడుకోవ‌చ్చు.  వికీపీడియాను  XOWA లాంటి థ‌ర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ల‌ను ఉప‌యోగించి ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. కానీ పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసుకుంటే ఎక్క‌డికైనా స‌మాచారాన్ని తీసుకెళ్లొచ్చు. 

 

యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌, ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డ్రైవ్ లాంటి ఎలాంటి స్టోరేజ్ డివైస్‌లోకి అయినా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి థ‌ర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్ హెల్ప్ అక్క‌ర్లేకుండా నేరుగా వికీపీడియా నుంచే డైన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  క‌రెంట్ రివిజ‌న్స్ మాత్ర‌మే (యూజ‌ర్ పేజ‌స్‌, టాక్‌వంటివి లేకుండా) కావాలంటే అవే డౌన్లోడ్ చేయొచ్చు.  

వికీపీడియాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

బ్రౌజ‌ర్‌లో Wikipedia:Database download అని  ఎంట‌ర్ చేసి సెర్చ్ కొడితే ఓ పేజీ ఓపెన్ అవుతుంది.

* ఈ పేజీలో రెండో ఆప్ష‌న్‌గా Where do I get it?  అనే  సెక్ష‌న్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేస్తే  Download లింక్ క‌నిపిస్తుది. ఈ పేజీలో మీకు  క‌రెంట్ రివిజ‌న్స్‌, ఆల్ రివిజ‌న్స్ వంటి అన్ని డేటా బేస్ టైప్స్ క‌నిపిస్తాయి. 

* Download లింక్ క్లిక్ చేయ‌గానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో  అన్ని టైప్స్ డేటాబేస్ డౌన్‌లోడ్ లింక్స్ డిస్‌ప్లే అవుతాయి.

* ప్ర‌తి డౌన్‌లింక్ ప‌క్ర‌నే అదెంత సూజ్‌లో ఉందో  చూపిస్తుంది. 

* వీటిలోంచి ఏ డేటా బేస్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అక్క‌డ డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే చాలు ఓ టొరంట్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.  ఏదైనా టొరంట్ క్ల‌యింట్‌తో వికీపీడియాను డౌన్‌లోడ్ చేయ‌డం స్టార్ట్ చేయొచ్చు. 

మీరు దీన్ని  USB flash drive లోకి డౌన్‌లోడ్ చేసి దాని నుంచి వాడుకోవ‌లంటే డౌన్‌లోడ్ డెస్టినేష‌న్‌ను   USB driveకి సెట్ చేయాలి.

* డౌన్‌లోడ్ కంప్లీట్ అయిన వెంట‌నే మీకు కంప్రెస్డ్ ఫైల్ క‌నిపిస్తుంది. ఏదైనా అన్‌జిప్ సాఫ్ట్‌వేర్ ( 7Zipలాంటిది) తో దీన్ని ఓపెన్ చేసి ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవ‌చ్చు.   అప్పుడు మీకు  వికీపీడియా ఆర్టిక‌ల్స్ XML file  ఫార్మాట్‌లో వ‌స్తాయి. దీన్ని  XML viewerతో ఓపెన్ చేసి ఆఫ్‌లైన్‌లో కూడా చ‌దువుకోవ‌చ్చు. 

* ఒక స్పెసిఫిక్ పేజీ లేదా కేట‌గిరీని డౌన్‌లోడ్ చేయాల‌న‌కుంటే   Special: Export లింక్‌ను క్లిక్ చేసి ఆ కేట‌గిరీ పేరు మాన్యువ‌ల్‌గా  ఎంట‌ర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు