• తాజా వార్తలు

పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

పాస్‌పోర్ట్ కావాలంటే ఆ ప‌ర్స‌న్ ఫ‌లానా ప్లేస్‌లో నివ‌సిస్తున్నాడ‌ని తెలిపే  Residence Certificate for passport క‌చ్చితంగా ఉండాలి.   పాస్‌పోర్ట్‌కు అప్లికేష‌న్‌లో ప‌ర్స‌న్ రెసిడెన్సీని మెన్ష‌న్ చేయ‌డం మ్యాండేట‌రీ.  అప్పుడు  ఈ స‌ర్టిఫికెటే ప్రూఫ్‌.   ఈ  రెసిడెన్స్ స‌ర్టిఫికెట్ (నివాస ధృవీక‌ర‌ణ‌ప‌త్రం)లో ఉన్న అడ్ర‌స్‌నే పాస్‌పోర్ట్ ఆఫ్ అథారిటీ చెక్ చేస్తుంది.  ఈ స‌ర్టిఫికెట్‌లో ఉన్న అడ్ర‌స్‌.. పాస్‌పోర్టు అప్లికేష‌న్‌లో రాసిన ప‌ర్మినెంట్ అడ్ర‌స్‌తో మ్యాచ్ కాక‌పోతే పాస్‌పోర్ట్ అప్లికేష‌న్ కేన్సిల్ అవుతుంది. కాబ‌ట్టి  Residence Certificate for passport అప్ల‌యి చేసేట‌ప్పుడు డిటెయిల్స‌న్నీ జాగ్ర‌త్త‌గా ఫిల్ చేయాలి.  ఈ స‌ర్టిఫికెట్‌ను మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా  తీసుకోవ‌చ్చు.  దీనికి 35 రూపాయ‌ల  యూజ‌ర్  ఛార్జి  వ‌సూలు చేస్తారు. 

మీసేవ ఆన్‌లైన్ ద్వారా ఓఆర్‌సీ పొంద‌డం ఎలా?

1) మీసేవ అఫీషియ‌ల్ వెబ్ పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో  services విభాగంలోకి వెళ్లి  revenue Departmentను సెలెక్ట్ చేసుకోవాలి.  Resident Certificate Serviceను సెలెక్ట్ చేయాలి.

 

2.) అప్పుడు resident certificate online application form స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది. దీనిలో అప్లికెంట్  డిటెయిల్స్‌, అడ్ర‌స్‌, పేరు, స‌ర్‌నేమ్‌తండ్రి పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, నేటివ్ డిటెయిల్స్‌, క్యాస్ట్ కేట‌గిరీ వంటి వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. ఏ ప‌ర్ప‌స్‌మీద రెసిడెంట్ స‌ర్టిఫికెట్‌కు అప్ల‌యి చేస్తున్నారు? ఆ అడ్ర‌స్‌లో  ఎన్నాళ్లుగా ఉంటున్నారో కూడా మెన్ష‌న్ చేయాలి.

 

 3) డెలివ‌రీ డిటెయిల్స్ సెక్ష‌న్‌లో మూడు ర‌కాల డెలివ‌రీ మోడ్స్ ( Manual, Post-Local, Post-Non Local) ఉంటాయి. మాన్యువ‌ల్ అంటే అప్లికెంట్ డైరెక్ట్‌గా  వెళ్లి జిల్లా కార్యాల‌యం నుంచి స‌ర్టిఫికెట్ తెచ్చుకోవాలి. పోస్ట్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్ అయితే పోస్ట‌ల్ అడ్ర‌స్ ఫిల్ చేయాలి. దీంతోపాటు పర్మినెంట్ అడ్ర‌స్ కూడా ఇవ్వాలి.

 

4) అప్లికేష‌న్ ఫామ్‌తోపాటు ఆధార్ కార్డ్‌, లేదా రేష‌న్ కార్డ్ లేదా ఎపిక్ కార్డ్‌, హౌస్ ట్యాక్స్ లేదా ఎల‌క్ట్రిసిటీ బిల్ లేదా టెలిఫోన్ బిల్‌ను స్కాన్ చేసి అటాచ్  చేయాలి. 

 

5) ఆఫ్‌లైన్ అప్లికేష‌న్  అయితే స్కాన్ చేసి  అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ కాగానే  షో పేమెంట్ ఆప్ష‌న్ వ‌స్తుంది. దీన్ని  క్లిక్ చేసి పేమెంట్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ డిటెయిల్స్ (క్రెడిట్ /  డెబిట్ కార్డ్‌) ఎంట‌ర్ చేయాలి. డిటెయిల్స‌న్నీ ఓకే అనుకుంటే  క‌న్‌ఫ‌ర్మ్ పేమెంట్‌ను ప్రెస్ చేయాలి.

 

6) Confirm Payment బ‌ట‌న్‌ను క్లిక్ చేయ‌గానే క‌న్ఫ‌ర్మేష‌న్ పూర్త‌యిన‌ట్లు  మెసేజ్ జ‌న‌రేట్ అవుతుంది.  మీ  రెసిడెన్స్ స‌ర్టిఫికెట్ రిక్వెస్ట్‌ను త‌హ‌సీల్దార్ అప్రూవ్ చేస్తే  స‌ర్టిఫికెట్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అడ్ర‌స్‌కు వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు