• తాజా వార్తలు

స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

చిన్న‌, స‌న్న‌కారు రైతులుగా (Small and marginal farmers) గుర్తింప‌బ‌డాలంటే   రైతులు అందుకు త‌గిన స‌ర్టిఫికెట్ పొందాలి. దీనికోసం రైతులు సంబంధిత డాక్యుమెంట్స్‌ను స‌మ‌ర్పించి స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. దీన్ని మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. మీసేవ ఆన్‌లైన్ ద్వారా చిన్న‌, స‌న్న‌కారు రైతు ధృవీక‌ర‌ణ‌ప‌త్రం (Small and Marginal Farmers Certificate) తీసుకోవ‌డానికి 10 రూపాయ‌ల యూజ‌ర్  ఛార్జి  వ‌సూలు చేస్తారు.  లోక‌ల్‌, నాన్‌లోక‌ల్ ఏరియాను బ‌ట్టి 35 రూపాయ‌ల వ‌ర‌కు పోస్ట‌ల్ ఛార్జీ ఉంటుంది.

మీసేవ ఆన్‌లైన్ ద్వారా స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ పొంద‌డానికి..

1) మీసేవ అఫీషియ‌ల్ వెబ్ పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో  services విభాగంలోకి వెళ్లి  revenue Departmentను సెలెక్ట్ చేసుకోవాలి.  Revenue Departmentలో  Issue of Small and Marginal Farmers Certificateను సెలెక్ట్ చేయాలి.

2.) Issue of Small and Marginal Farmers Certificateను క్లిక్ చేయగానే ఓఆర్‌సీ అప్లికేష‌న్  రిక్వెస్ట్ స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది. దీనిలో అప్లికెంట్  డిటెయిల్స్‌, అడ్ర‌స్‌, పేరు, తండ్రి పేరు, ఊరులాంటి వివ‌రాలు,   ల్యాండ్ డిటెయిల్స్‌, ల్యాండ్ ఎక్క‌డుంది? స‌ర్వే నెంబ‌ర్‌ల్యాండ్ టైప్ వంటి వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. దీంతోపాటు  పేమెంట్ మోడ్ కూడా ఎంట‌ర్ చేయాలి.

3) డెలివ‌రీ డిటెయిల్స్ సెక్ష‌న్‌లో మూడు ర‌కాల డెలివ‌రీ మోడ్స్ ( Manual, Post-Local, Post-Non Local) ఉంటాయి. మాన్యువ‌ల్ అంటే అప్లికెంట్ డైరెక్ట్‌గా వెళ్లి జిల్లా కార్యాల‌యం నుంచి స‌ర్టిఫికెట్ తెచ్చుకోవాలి. పోస్ట్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్ అయితే పోస్ట‌ల్ అడ్ర‌స్ ఫిల్ చేయాలి. దీంతోపాటు పర్మినెంట్ అడ్ర‌స్ కూడా ఇవ్వాలి.

4) ప‌హాణీ, ప‌ట్టాదారు పాసుపుస్త‌కం/  టైటిల్ డీడ్‌/ 1బీ ఎక్స‌ట్రాక్ట్‌/  రిజిస్ట‌ర్ సేల్ డీడ్ వీటిలో ఏది ఉంటే దాని జెరాక్స్ కాపీని, ల్యాండ్ ఓన‌ర్ సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ కాపీని స్కాన్ చేసి అప్లికేష‌న్‌లో అప్‌లోడ్ చేయాలి.

5) తర్వాత షో పేమెంట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేసి పేమెంట్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ డిటెయిల్స్ (క్రెడిట్ /  డెబిట్ కార్డ్‌) ఎంట‌ర్ చేసి క‌న్‌ఫ‌ర్మ్ పేమెంట్‌ను ప్రెస్ చేయాలి.

6) Confirm Payment బ‌ట‌న్‌ను క్లిక్ చేయ‌గానే క‌న్ఫ‌ర్మేష‌న్ పూర్త‌యిన‌ట్లు  మెసేజ్ జ‌న‌రేట్ అవుతుంది.  మీ  Small and Marginal Farmers Certificate రిక్వెస్ట్‌ను త‌హ‌సీల్దార్ అప్రూవ్ చేస్తే  స‌ర్టిఫికెట్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు  అందుతుంది.

జన రంజకమైన వార్తలు