ఎవరైనా తమ భూమి సరిహద్దులు నిర్ధారించుకోవాలంటే అధికారికంగా గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. దీన్నే Tonch Map Certificate అంటారు. దీన్ని మీ సేవ ద్వారా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మీసేవ ఆన్లైన్ ద్వారా Tonch Map Certificate తీసుకోవడానికి 50 రూపాయల యూజర్ ఛార్జి , 35 రూపాయల యూజర్ ఛార్జి తీసుకుంటారు.
మీసేవ ఆన్లైన్ ద్వారా స్మాల్, మీడియం ఫార్మర్ సర్టిఫికెట్ ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి..
1) మీసేవ అఫీషియల్ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో services విభాగంలోకి వెళ్లి revenue Departmentను సెలెక్ట్ చేసుకోవాలి. Revenue Departmentలో Issue of Tonch Map Certificateను సెలెక్ట్ చేయాలి.
2.) Issue of Tonch Map Certificateను క్లిక్ చేయగానే ఓఆర్సీ అప్లికేషన్ రిక్వెస్ట్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. దీనిలో అప్లికెంట్ డిటెయిల్స్, అడ్రస్, పేరు, తండ్రి పేరు, ఊరులాంటి వివరాలు, ల్యాండ్ డిటెయిల్స్, ల్యాండ్ ఎక్కడుంది? సర్వే నెంబర్, ల్యాండ్ టైప్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఇన్‌ఫర్మెంట్ పేరు, ల్యాండ్ ఓనర్‌తో ఉన్న రిలేషన్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయాలి. పేమెంట్ మోడ్ కూడా ఎంటర్ చేయాలి.
3) డెలివరీ డిటెయిల్స్ సెక్షన్లో మూడు రకాల డెలివరీ మోడ్స్ ( Manual, Post-Local, Post-Non Local) ఉంటాయి. మాన్యువల్ అంటే అప్లికెంట్ డైరెక్ట్‌గా వెళ్లి జిల్లా కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. పోస్ట్ లోకల్, నాన్ లోకల్ అయితే పోస్టల్ అడ్రస్ ఫిల్ చేయాలి. దీంతోపాటు ఫర్దర్ వెరిఫికేషన్ కోసం పర్మినెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి.
4) పహాణీ, పట్టాదారు పాసుపుస్తకం/ టైటిల్ డీడ్/ 1బీ ఎక్సట్రాక్ట్/ రిజిస్టర్ సేల్ డీడ్ వీటిలో ఏది ఉంటే దాని జెరాక్స్ కాపీని, ల్యాండ్ ఓనర్ సెల్ఫ్ డిక్లరేషన్ కాపీని స్కాన్ చేసి అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. పోస్టల్ డిటెయిల్స్‌లో డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
5) ఆఫ్ లైన్లో అప్లికేషన్ ఫాం ఫిల్ చేస్తే దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ కాగానే షో పేమెంట్ బటన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే మీరు అప్లోడ్ చేసిన డాక్యమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ పేమెంట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ డిటెయిల్స్ (క్రెడిట్ / డెబిట్ కార్డ్) ఎంటర్ చేసి కన్ఫర్మ్ పేమెంట్‌ను ప్రెస్ చేయాలి.
6) Confirm Payment బటన్‌ను క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ పూర్తయినట్లు మెసేజ్ జనరేట్ అవుతుంది. మీ Tonch Map Certificate రిక్వెస్ట్‌ను తహసీల్దార్ అప్రూవ్ చేస్తే ఆ సర్టిఫికెట్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు అందుతుంది.