• తాజా వార్తలు

యూ ట్యూబ్‌లో పాత లేఅవుట్ తిరిగి తెచ్చుకోవ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీరు యూ ట్యూబ్ పవ‌ర్ యూజ‌ర్ అయితే కొత్త లే అవుట్‌ను చాన్నాళ్లుగా చూస్తూనే ఉంటారు. అయితే ఇప్ప‌టికీ ఇది బీటా వెర్ష‌న్ కావ‌డంతో సెలక్టెడ్ యూజ‌ర్ల‌కే అందుబాటులో ఉండేది. లేటెస్ట్‌గా యూ ట్యూబ్ కొత్త డెస్క్‌టాప్ మెటీరియ‌ల్ డిజైన్ ఇంట‌ర్‌ఫేస్‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.  పెర్‌ఫార్మెన్స్ మెరుగుప‌ర‌చ‌డానికి  కొత్త లే అవుట్ ను గూగుల్ పాలిమ‌ర్ ఫ్రేమ్‌వ‌ర్క్‌తో డిజైన్ చేశారు. అయితే కొత్త లే అవుట్ క‌ళ్ల‌కు అంత సౌక‌ర్యంగా లేద‌ని కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయి. లైక్స్ /  డిస్‌లైక్స్ బార్ షార్ట్‌గా ఉండ‌డం, వీడియోను ఎంత మంది చూశారో తెలిపే వ్యూ స్టాట్స్ ఆప్ష‌న్ లేక‌పోవ‌డం వంటివి యూజ‌ర్లు చాలా మంది ఇబ్బందిగా ఫీల‌వుతున్నారు. కార‌ణం ఏదైనా.. యూ ట్యూబ్ పాత లే అవుటే బాగుంద‌ని అనిపిస్తే దానికి  మారిపోవ‌చ్చు. ప్రొసీజ‌ర్ కూడా చాలా ఈజీ.  

పాత లేఅవుట్‌కు మార్చుకోవాలంటే..
* యూట్యూబ్ హోం పేజీలో రైట్ కార్న‌ర్‌లో టాప్‌లో ఉన్న యూజ‌ర్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి
* Restore old YouTube”  ను క్లిక్ చేయాలి 
* మీరు పాత యూట్యూబ్‌కు ఎందుకు వెళ్లాల‌నుకుంటున్నారో రీజ‌న్ మెన్ష‌న్ చేసి  Submit ను క్లిక్ చేయాలి.  
* అంతే మీకు యూ ట్యూబ్ పాత లేఅవుట్ వ‌చ్చేస్తుంది.  

అయితే ఇలా పాత లేఅవుట్‌కు మారడానికి ఎంత కాలం యూట్యూబ్ ప‌ర్మిట్ చేస్తుందో తెలియ‌దు. ఎక్కువ‌మంది యూజ‌ర్లు కొత్త లేఅవుట్‌లో ఉన్న ప్రాబ్ల‌మ్స్‌ను రీజ‌న్‌లో మెన్ష‌న్ చేస్తే వాటిని స‌రిదిద్దే అవ‌కాశాలున్నాయి.  

జన రంజకమైన వార్తలు