మీ ఫోన్లో పర్సనల్ విషయాలు చాలా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో మీ పర్సనల్ వీడియోల వంటివి వేరేవాళ్లు చూడకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్లే స్టోర్‌లో ఇన్స్ట్యూబ్ (InsTube) యాప్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసి వీడియోలతోపాటు మ్యూజిక్‌ను కూడా వేరేవాళ్లు చూడకుండా లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్ ద్వారా ఆన్లైన్ సైట్స్ నుంచి ఫ్రీగా, ఫాస్ట్‌గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
1. ప్లే స్టోర్‌లోకి వెళ్లి InsTube యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. Terms and Conditionsను యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని సైన్ ఇన్ అయి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
InsTubeలో వీడియోస్‌ను ఎలా హైడ్ / లాక్ చేసుకోవాలి?
1. ఇన్స్ట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేసి మీరు హైడ్ చేయాలనకున్ వీడియో లేదా మ్యూజిక్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చిన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన వీడియోను హైడ్ / లాక్ చేయాలా అనే ఆప్షన్ వస్తుంది. హైడ్ / లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి.
2. హైడ్ / క్లిక్ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే Added to Private Space అనే మెసేజ్ వస్తుంది. వెంటనే మీ వీడియో లేదా మ్యూజిక్ ఫైల్ ఫోన్లోంచి మాయమవుతుంది.
InsTubeలో వీడియోస్‌ను ఎలా అన్ లాక్ చేసుకోవాలి?
1. InsTube యాప్‌ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్‌లో మెనూలో ఉన్న Private ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
2. Private ఆప్షన్‌ను క్లిక్ చేయగానే ఫస్ట్ టైమ్ 4 అంకెల పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సారి నుంచి మీరు వీడియో లేదా మ్యూజిక్‌ను అన్‌లాక్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను క్లిక్ చేస్తే మీరు హైడ్ చేసిన వీడియో లేదా మ్యూజిక్ ఫైల్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.
3. ఇందులో నుంచి మీరు అన్‌లాక్ / అన్‌హైడ్ చేయాలనుకున్న ఫైల్ మీద టాప్ చేయాలి. ఇప్పుడు ఓ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో ఉన్నఅన్హైడ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఆ ఫైల్ మీ ఫోల్డర్లో తిరిగి సేవ్ అవుతుంది.