• తాజా వార్తలు

యాప్స్‌ను ఫోన్ మెమ‌రీ నుంచి ఎస్‌డీ కార్డుకు పంప‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మ‌న స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో యాప్‌లు ఉంటాయి. వాటిలో అవ‌స‌ర‌మైన‌వి కొన్ని అవ‌స‌రం లేనివి ఎన్నో! కానీ ఈ యాప్‌ల గురించి మ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోం. కానీ ఒక ద‌శ‌కు రాగానే మ‌న ఫోన్ మెమ‌రీ అయిపోతుంది. దీంతో అప్పుడు యాప్‌ల మీద మ‌న దృష్టి ప‌డుతుంది. వాటిలో  ఏ యాప్‌లు తీయాలో ఏవి తీయ‌కూడ‌దో మ‌న‌కు అర్థం కాదు. ఈ నేప‌థ్యంలో యాప్‌ల‌ను డిలీట్ చేయ‌కుండానే ఫోన్ మెమ‌రీ నుంచి వేరే చోట‌కు త‌ర‌లిస్తే బాగుంటుంది క‌దా! అంటే మ‌న ఫోన్ మెమ‌రీ ప‌రిమితంగా ఉంటుంది. దీన్ని ఎస్‌డీ కార్డుకు పంపితే ప్రాబ్ల‌మ్స్ సాల్వ్! మ‌రి అదెలాగంటే...

ఆండ్రాయిడ్ ఫోన్ల‌తోనే స‌మ‌స్య‌
చాలా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మెమ‌రీ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు 8 జీబీకి మించి ఫోన్లు వ‌చ్చేవి కావు. ఇప్పుడ‌వి 16 జీబీకి చేరాయి. కానీ మ‌న డేటా మాత్రం అప‌రిమితంగా పెరిగిపోయింది. ముఖ్యంగా వాట్స‌ప్ మెసేజ్‌ల‌తోనే స‌గం డేటా నిండిపోతుంది. ఈ ఇబ్బంది నుంచి త‌ప్పించుకోవ‌డానికి ముందుగా యాప్స్‌ను మెమ‌రీ కార్డులోకి త‌ర‌లించాలి. ఆండ్రాయిడ్‌లో ఎంట్రీ ఎలెల్ ఫోన్తోనే ఈ ఇబ్బందులు ఎక్కువ‌గా ఉంటాయి. 

యాప్స్‌ను ఇంట‌ర్న‌ల్ మెమెరీ నుంచి ఎస్‌డీ కార్డుకు పంపండిలా..

సెట్టింగ్స్‌లో యాప్ మేనేజ్‌మెంట్ సెక్ష‌న్‌కు వెళ్లి  మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని యాప్‌ల‌ను ముందుగా లిస్ట్ చేయాలి. ఒక్కో యాప్‌ను సెల‌క్ట్ చేస్తూ పోవాలి.  ప్ర‌తి యాప్‌కు ఒక వ్య‌క్తిగ‌త సెట్టింగ్ ఉంటుంది. అందులోకి వెళ్లాలి.

యాప్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసిన త‌ర్వాత అక్క‌డ మూవ్ టు ఎస్‌డీ కార్డ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.  మీ ఫోన్ మ‌రియు ఎస్‌డీ కార్డు మెమ‌రీలో ఉన్న యాప్స్‌ను ఆండ్రాయిడ్ డిటెక్ట్ చేసి మీకు వివ‌రాలు అందిస్తుంది. 

అన్ని యాప్స్ మీద క్లిక్ చేసిన త‌ర్వాత మూవ్ టు ఎస్‌డీ కార్డు ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ప్రోసెస్ పూర్త‌య్యే వ‌ర‌కు వెయిట్ చేయాలి. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఎస్‌డీ కార్డులోకి యాప్స్ వెళ్లిపోయాక మీరు అన్ అమౌంట్ చేయ‌చ్చు. ఇంకేమైనా యాప్స్ మిగిలున్నాయేమో చెక్ చేయ‌చ్చు.  ఎస్‌డీ కార్డులోకి వెళ్లిన యాప్స్‌ను ఇత‌ర ఫైల్స్‌ను కూడా మీరు మ‌ళ్లీ తిరిగి డివైజ్‌లోకి తెచ్చుకోవ‌చ్చు. దీనికి మూవ్ టు ఫోన్ స్టోరేజ్‌ ఆప్ష‌న్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు