• తాజా వార్తలు

వెబ్‌పేజీల‌ను జేపీజీ, పీఎన్‌జీలుగా సేవ్ చేయడం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వెబ్‌పేజీ ఇమేజ్‌ల‌ను క్రోమ్‌, ఒపెరా డెస్క్‌టాప్ యూజ‌ర్లు స‌పోర్ట్ చేస్తాయి. ఇది ఇమేజ్ క్వాలిటీ చెడిపోకుండా కంప్రెస్ చేసే ప‌ద్ధ‌తి. కానీ  చాలా ఇమేజ్ ఎడిట‌ర్లు, ఇమేజ్ వ్యూయ‌ర్స్, ఫైర్‌ఫాక్స్‌లాంటి బ్రౌజ‌ర్లలో ఈ ఫెసిలిటీ ఉండ‌దు. అందుకే   ఆన్‌లైన్లోని ఎలాంటి వెబ్‌పేజీనైనా జేపీజీ లేదా పీఎన్‌జీ ఇమేజ్‌గా సేవ్ చేసుకుని అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాడుకోవచ్చు.  
క్రోమ్ బ్రౌజ‌ర్‌లో సేవ్ చేయ‌డం ..
1. గూగుల్ క్రోమ్  ఓపెన్ చేసి వెబ్‌పేజీ ఇమేజ్ ఉన్న ఏదైనా వెబ్‌పేజీని ఓపెన్ చేయండి. ఇమేజ్‌పైన రైట్ క్లిక్ చేసి “Open image in new tab ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేయండి.
2. ఇమేజ్ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అయ్యాక దాని పేరు చివ‌ర  rwతో కూడిన యూఆర్ ఎల్ క‌నిపిస్తుంది. rwని తీసేయండి. ఇప్పుడు ఇమేజ్‌ను మ‌రోసారి లోడ్ చేయ‌డానికి ఎంట‌ర్‌ను నొక్కండి.  
3. ఇప్పుడు ఇమేజ్ ఒరిజిన‌ల్ ఫార్మాట్‌లో ఓపెన్ అవుతుంది.  ఇప్ప‌డు రైట్ క్లిక్ చేసి Save as ఆప్ష‌న్‌ను టాప్ చేయండి.  ఇప్పుడు సెప‌రేట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు వెబ్‌పేజీ ఇమేజ్‌ను జేపీజీ లేదా పీఎన్జీ ఇమేజ్‌గా మీ పీసీలో ఎక్క‌డ కావాలంటే అక్క‌డ సేవ్ చేసుకోవ‌చ్చు. 
ఒపెరా బ్రౌజ‌ర్‌లో అయినా ఇదే ప్రొసీజ‌ర్‌లో మీకు కావాల్సిన వెబ్‌పేజీని జేపీజీ లేదా పీఎన్జీ ఇమేజ్‌గా సేవ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు