• తాజా వార్తలు

వాట్సాప్‌, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లో మెసేజ్‌ల‌ను షెడ్యూల్ చేసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వాట్సాప్‌, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్  వ‌చ్చాక సందేశాలు చాలా ఈజీగా, ఎఫెక్టివ్‌గా పంపేసుకుంటున్నాం. చ‌దువు రానివారు కూడా ఎవ‌రైనా గుడ్ మార్నింగ్‌, గుడ్‌నైట్ మెసేజ్‌లు, పండ‌గ‌లు, ప‌బ్బాల‌కు పంపే శుభాకాంక్ష‌ల మెసేజ్‌లు త‌మ‌కు రాగానే షేర్ చేస్తున్నారు.  ఫొటోలు తీసి షేర్‌చేసుకుంటున్నారు. అయితే వాట్సాప్‌లోనో, టెలిగ్రామ్‌లోనో మెసేజ్ ఫ‌లానా టైమ్‌కి పంపాలంటే ఆ టైమ్‌కి మ‌నం ఆ యాప్‌లో యాక్టివ్‌గా ఉండాలి. కానీ అన్నివేళల్లోనూ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఎవ‌రో ఫ్రెండ్‌కు రేపు ఉద‌యం మెసేజ్ పంపాల‌నుకున్నారు. కానీ ఆ టైమ్‌కు మీకు గుర్తు లేదు. త‌ర్వాత ఎప్పుడో పంపించినా దానివల్ల ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే మీరు ఫ‌లానా తేదీకి ఫ‌లానా టైమ్‌కు మెసేజ్ పంపుకునేలా మెసేజ్‌ను ముందే షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. scheduled- scheduled your text messages యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ మెసేజ్‌ల‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
ఎలా ఉప‌యోగించుకోవాలి?
1.scheduled- scheduled your text messages యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. యాప్ ఎపెన్ చేసి క్లిక్ టు కంటిన్యూ నొక్కి ముందుకెళ్లాలి.
3. ఇందులో మూడు ఆప్ష‌న్లు ఉంటాయి. ప్రీమియం ప్ల‌స్ ఆటో సెండ్‌, ప్రీమియం, ఫ్రీ అనే మూడు ర‌కాలున్నాయి.  ప్ర‌తి ప్లాన్ ఖ‌రీదు ఎంతో దాని కిందే వివ‌రాలుంటాయి. అయితే ముందుగా ఫ్రీ వెర్ష‌న్ వాడుకుని సంతృప్తి చెందితే అప్పుడు డ‌బ్బులు చెల్లించి ప్రీమియం ఆప్ష‌న్లు వాడుకోవ‌చ్చు. 
4.  Not now ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి షెడ్యూల్డ్ యాప్‌ను స్టార్ట్ చేయాలి.
5. మీరు ఇప్పుడు ఫ్రీ వెర్ష‌న్‌లో ఉన్నారు. మీరు ఫ‌స్ట్ మెసేజ్‌ను క్రియేట్ చేయ‌డానికి మెసేజ్ క్రియేష‌న్ సెక్ష‌న్‌లోకి వెళ్లి రెసిపెంట్స్‌ను మీ కాంటాక్స్ట్‌లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి.దీనికి ముందు మీరు ఈ యాప్‌కు మీ కాంటాక్స్ట్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమ‌తివ్వాలి.
6. ఇప్పుడు మీరు పంపాల్సిన టెక్స్ట్ మెసేజ్‌ను ఎంట‌ర్ చేసి ఏ డేట్‌, టైమ్‌కు పంపాలో వాటిని సెట్ చేసుకోవాలి. ఈ మెసేజ్‌ను మీరు రోజూగానీ, వారానికోసారిగానీ, నెల‌కోసారిగానీ, సంవ‌త్స‌రానికోసారిగానీ పంపాల‌నుకుంటే షెడ్యూల్ చేసుకునే ఆప్ష‌న్ కూడా ఉంది.
7. ఆటో సెండ్ ఆప్ష‌న్ ప్రీమియం మెంబ‌ర్స్‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది.
8. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, హైక్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ వంటి అన్ని మెసేజ్ యాప్స్‌ల్లోనూ ఇది ప‌ని చేస్తుంది. ఏ యాప్‌కు పంపాలో మీరు అక్క‌డ సెలెక్ట్ చేసుకోవాలి.
9.  ఏ ఫ్లాట్‌ఫాంకి పంపాలో సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ బ‌ట‌న్ నొక్కి సెండ్ చేయాలి. ఈ మెసేజ్ అవ‌త‌లి వ్య‌క్తికి సెండ్ అయ్యేంత వ‌ర‌కు అది షెడ్యూల్డ్ మెసేజ్‌గా స్క్రీన్‌మీద క‌నిపిస్తుంటుంది.
ఇవీ స్పెషాలిటీస్‌
* ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ మొబైల్స్ రెండింటికీ అందుబాటులో ఉంది.
* ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ బ‌ర్త్‌డేలు, పెళ్లి రోజులు వంటి రోజున కూడా ఇలాంటి షెడ్యూల్డ్ మెసేజ్‌లు పంపాలంటే వాటిని యాప్‌కు యాడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు