• తాజా వార్తలు

మీకు ఇష్టమైన ఫేస్‌బుక్ పేజీల‌ పోస్టులు మిస్ అవకుండా చూడటం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఫేస్‌బుక్‌.. ప్రపంచాన్ని ఓ చోట‌కు చేర్చిన సామాజిక మాధ్య‌మం.  ఇందులో ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, ఇమేజ్‌లు, వీడియోలే కాదు..లైక్‌మైండెడ్ పీపుల్‌ను ఒకేచోట‌కు చేర్చే క‌మ్యూనిటీ పేజీలు చాలా ఉన్నాయి.  హీరోలు, క్రికెట‌ర్లు ఇలా సెల‌బ్రిటీల ఫ్యాన్స్ పేజీలు, క‌థ‌లు, క‌వితలు, కామెడీ క్లిప్స్ పంచుకునే పేజీలు ఇలా కొన్ని ల‌క్ష‌ల పేజీలు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి.  నచ్చిన పుస్తకాల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించి కూడా పేజీలు పెడుతున్నారు. అయితే వీటిలో మీరు ఇష్టపడే కొన్ని పేజీల నుంచి మీరు పోస్ట్స్ మిస్ అవుతున్నారా? అని బాధ‌ప‌డుతున్నారా? మిస్ అవుతున్న పోస్టులను చూసేందుకు ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవండి.
వెబ్‌లో  చూడటం ఎలా?
మీరు మీ ఫీడ్‌లో మొదట చూడాలనుకుంటున్న పేజికి వెళ్లండి. అది చెప్పినట్లుగా ఫాలో అవ్వండి. 
* ఇప్పుడు మీ న్యూస్ ఫీడ్‌లో మొదటిదాన్ని సెలక్ట్ చేసుకోండి. అదనంగా, మీరు నోటిఫికేషన్లను ప్రారంభించాలనుకుంటే, నోటిఫికేషన్ల పక్కన ఉన్న చిన్న పెన్సిల్ సింబల్ పై క్లిక్ చేయండి. ( మీకు నోటిఫికేషన్లు కావాలంటేనే ఆల్ ఆఫ్ చెక్ చేయండి) 
* మీకు కావాల్సినదాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత డన్ క్లిక్ చేయండి. 
* అంతే ఇప్పుడు మీ న్యూస్ ఫీడ్‌లో మొదటి పేజీ లోనే పోస్ట్‌లు క‌నిపిస్తాయి. అంతేకాదు వాటిని ఎప్పుడు పోస్ట్ చేశారో కూడా నోటిఫికేష‌న్ల ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి ఆప్షన్స్ వెతకాల్సిన అవసరం లేదు.
మొబైల్‌లో చూడటం ఎలా?
మీ న్యూస్ ఫీడ్‌లో చూడాలనుకుంటున్న పేజికి వెళ్లండి. దాన్ని ఫాలో అవుతూ ట్యాప్ చేయండి. 
* ఇప్పుడు న్యూస్ ఫీడ్లో మొదటి దాన్ని చూడండి. 
* మీరు కావాలనుకుంటే కొత్త పోస్ట్ రాగానే తెలియ‌జేసేందుకు నోటిఫికేష‌న్స్ అనేబుల్‌చేసుకోవ‌చ్చు. లేదా రిసీవ్ చేసుకునే నోటిఫికేషన్లను కాన్ఫిగర్ చేయడానికి, నోటిఫికేషన్ సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. 
* వీట‌లో నుంచి మీకు కావాల్సినవి సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇష్టమైన పేజీలోని పోస్టులన్నింటినీ మిస్సవ్వకుండా చూడవచ్చు.  

 

జన రంజకమైన వార్తలు