• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్‌పై వాల్‌పేప‌ర్‌గా వీడియో సెట్ చేయడం ఎలా?

ఫోన్ స్క్రీన్ అందంగా కనిపించాలని  ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. అందుకే ఫోన్‌లో ర‌క‌ర‌కాల స్క్రీన్ సేవ‌ర్లు పెడుతుంటారు. వాల్‌పేపర్‌గా కూడా బోల్డ‌న్ని సీన‌రీస్‌, పిల్ల‌ల ఫొటోలు పెట్టుకుంటూ ఉంటారు.  అయితే ఇప్పటి వరకు స్క్రీన్ పై థీమ్స్ సెట్ చేసుకోవడమే తెలుసు. ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ పై వాల్ పేపర్‌గా వీడియోను కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ  ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
ZOOP GIF Lockscreen జూప్ జిఫ్ లాక్ స్క్రీన్
ఇది ఒక ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్. దీంతో మీ గ్యాలరీ నుంచి వీడియోలను సెలక్ట్ చేసుకోని...లాక్ స్క్రీన్ వాల్ పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. కేవలం వీడియోలే కాదు.. ఈ యాప్‌ను ఉప‌యోగించి జిఫ్‌ల‌ను కూడా లాక్ స్క్రీన్ వాల్ పేపర్‌గా  సెట్ చేసువచ్చు.
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోzoop gif lockscreen యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి. 
2. మెయిన్ స్క్రీన్‌లో జిఫ్ సెట్టింగ్స్ ఆఫ్షన్ కనపడుతుంది. ఈ ఐకాన్‌ను  నొక్కి బాటమ్ + బటన్ను నొక్కితే...కొత్త స్క్రీన్ కనిపిస్తుంది.
3. ఇప్పుడు + బటన్ పై నొక్కి Import from Gallery ఆప్ష‌న్‌ సెలక్ట్ చేసుకోండి. ఇలా చేసిన వెంటనే లాక్ స్క్రీన్ వాల్ పేపర్‌గా సెట్ చేయాలనుకునే మీ ఫోటో గ్యాలరీ నుంచి వీడియో లేదా జిఫ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. బాటమ్‌లో మీకు కావాల్సిన అన్ని వీడియోలు, జిఫ్‌లు ప్రత్యేక ట్యాబ్‌లో కనిపిస్తాయి.
4. ఒక వీడియోను సెలక్ట్ చేసుకున్నాక మెయిన్ స్క్రీన్ కు వెళ్లి లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ ఆప్షన్ నొక్కండి. లాక్‌స్క్రీన్ ఆన్‌, ఆఫ్ ఆప్ష‌న్‌తో ఉన్న స్లైడ‌ర్ బ‌ట‌న్‌ను టూగుల్ చేయండి. 
5. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియో వాల్‌పేప‌ర్‌గా ఉండే ఒక కొత్త లాక్ స్క్రీన్ యాక్టివేట్ అవుతుంది. ఇదే ప‌ద్ధ‌తిలో లాక్ స్క్రీన్‌పై  ఫోన్ గ్యాలరీ నుంచి సెలక్ట్ చేసుకున్న జిఫ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.
6. లాక్‌స్క్రీన్ మధ్యలో వీడియో కనిపిస్తుంది. కానీ స్క్రీన్ మొత్తం వీడియోను చూడాలనుకుంటే లాక్‌స్క్రీన్  సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లి జిఫ్ ఫుల్‌ స్క్రీన్ మోడ్ ఆన్‌, ఆఫ్‌ను ప్రారంభించండి. మల్టీ లాక్ స్క్రీన్లను ఎవాయిడ్ చేయ‌డానికి, ఫోన్‌లో డిఫాల్ట్ లాక్ స్క్రీన్‌ను డిసేబుల్ చేయడం మంచిది. 

జన రంజకమైన వార్తలు