• తాజా వార్తలు
  •  

ఎయిర్‌టెల్‌, జియోల్లో ఫ్లాష్ మెసేజ్‌ల‌ను స్టాప్ చేయడం ఎలా?

ఎయిర్‌టెల్‌, జియోల్లో ఫ్లాష్ మెసేజ్‌ల‌ను స్టాప్ చేయడం ఎలా?స్మార్ట్‌ఫోన్ లేక‌పోతే క్ష‌ణం గ‌డ‌వ‌డం లేదు చాలా మందికి. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు వ‌చ్చాక అన్నింటికీ సెల్‌ఫోనే ఆధార‌మైపోయింది. కానీ కంపెనీలు పంపించే మెసేజ్‌లు, ముఖ్యంగా ఫ్లాష్ మెసేజ్‌ల‌తో యూజ‌ర్ల‌కు విసుగెత్తిపోతోంది. ముఖ్యంగా  హ‌డావిడిగా ఫోన్ వాడుతున్న‌ప్పుడు ఫ్లాష్ మెసేజ్‌లు వ‌చ్చి పాప్ అవుతుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది.  ఇలాంటి ప‌రిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే రెమిడీస్ ఇవిగో 

ఎయిర్‌టెల్‌లో ఫ్లాష్ మెసేజ్‌లు ఆప‌డం ఎలా? 
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే మీ ఫోన్ యాప్ సెక్ష‌న్‌లోకి వెళ్లి Airtel Live ను టాప్ చేయండి. ఒక‌వేళ అక్క‌డ క‌నిపించ‌క‌పోతే సిమ్ టూల్ కిట్ లో క‌నిపిస్తుంది. 
* ఎయిర్‌టెల్ లైవ్‌ను టాప్ చేసి అందులో నుంచి Airtel Nowను టాప్ చేయండి.
* ఇప్పుడు మీకు స్టార్ట్ / స‌్టాప్ అనే ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. స్టాప్ అనే ఆప్ష‌న్‌ను టాప్ చేయ‌డ‌గానే ఎయిర్‌టెల్ ఫ్లాష్ మెసేజ్‌లు డిజేబుల్ అవుతాయి. అప్ప‌టి నుంచి మీ ఫ్లాష్ పాప్ అప్స్ హెడేక్ ఉండ‌దు.  
మీ ఎయిర్‌టెల్ నెంబ‌ర్ నుంచి  STOP ANOW అని  58234 నెంబ‌ర్‌కు ఎస్ ఎంఎస్ చేసినా ఫ్లాష్ మెసేజ్ స‌ర్వీస్ డీ యాక్టివేట్ అవుతుంది.  

జియోలో ఫ్లాష్ మెసేజ్‌లు ఆప‌డం ఎలా? 
ఆండ్రాయిడ్ ఫోన్‌లో జియో సిమ్ వాడేవారికి  MyJio యాప్ వ‌ల్లే ఎక్కువ ఫ్లాష్ మెసేజ్ లు వ‌స్తుంటాయి. కాబ‌ట్టి ఆ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేస్తే ఫ్లాష్ మెసేజ్‌లు ఆగిపోతాయి. 
 * సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ను టాప్ చేయండి. మై జియో యాప్‌ను సెలెక్ట్ చేయండి.
*  Force Stop,  Uninstall అని రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.  Uninstall క్లిక్ చేస్తే మై జియో యాప్ అన్ఇన్‌స్టాల్ అయిపోతుంది.
లేదంటే మై జియో యాప్‌ను లాంగ్ ప్రెస్ చేసి ప‌ట్టుకుంటే  Uninstall ఆప్ష‌న్ వ‌స్తుంది. దీన్ని క్లిక్ చేసినా అన్ ఇన్‌స్టాల్ అవుతుంది.  
అయితే మై జియో యాప్ లేక‌పోతే మీ బ్యాల‌న్స్, డేటా యూసేజ్ వంటి వివ‌రాలు డైరెక్ట్‌గా తెలుసుకోలేం. మీరు ఫ్లాష్ మెసేజ్‌ల‌తో ఇబ్బందిప‌డుతుంటే యాప్‌ను డిజేబుల్ చేసేయండి. మీ బ్యాల‌న్స్‌, డేటా యూసేజ్ వివ‌రాలు కావాలంటే జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు