• తాజా వార్తలు
  •  

ఐడియా, వొడాఫోన్‌ల్లో  ఫ్లాష్ మెసేజ్‌ల‌ను ఆప‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్ అన్నింటికీ   ఆధార‌మైపోయింది. కానీ కంపెనీలు పంపించే మెసేజ్‌లు, ముఖ్యంగా ఫ్లాష్ మెసేజ్‌ల‌తో యూజ‌ర్ల‌కు విసుగెత్తిపోతుంటే వాటిని స్టాప్ చేయ‌డానికి మార్గాలున్నాయి.  
ఐడియాలో ఫ్లాష్ మెసేజ్‌లు ఆప‌డం ఎలా? 
ఆండ్రాయిడ్ లో ఎఐడియా సిమ్ వాడుతున్నారా?  అయితే ఐడియాలో ఫ్లాష్ మెసేజ్ లు ఆప‌డానికి డైరెక్ట్ ఆప్ష‌న్ లేదు.  ఐడియా ప‌వ‌ర్‌లో చూసినా అలాంటి ఆప్ష‌న్లేవీ లేవు.  అయితే చాలా ఫోన్ల‌లో ఐడియా ప‌వ‌ర్‌లోకి వెళ్లి ఐడియా ఫ్లాష్‌ను టాప్ చేసి యాక్టివేష‌న్ లోకి డీయాక్టివేట్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసి ఫ్లాష్ మెసేజ్‌లు ఆగిపోతాయి.   
మీ ఐడియానెంబ‌ర్ నుంచి *121*46# డ‌య‌ల్ చేస్తే  మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన‌ట్లు, డేటా నోటిఫికేష‌న్లు ఆపేస్తామ‌ని మెసేజ్ వ‌స్తుంది. 

వొడాఫోన్‌లో.. 
 వొడాఫోన్ యూజ‌ర్లు  ఫ్లాష్ మెసేజ్ ల‌ను స్టాఫ్ చేయాలంటే  సిమ్ టూల్ కిట్‌లోకి వెళ్లి  Vodafone Servicesను టాప్ చేయాలి.  
* వొడాఫోన్ స‌ర్వీస్ స్క్రీన్ ఓపెన్ అయ్యాక FLASHను టాప్ చేయండి.
* ఇప్పుడు ఫ్లాష్ సెట్టింగ్స్ పేజీ క‌నిపిస్తుంది. దీనిలో ఉన్న Activation ఆప్ష‌న్‌ను టాప్ చేయండి.
 * త‌ర్వాత Deactivateను టాప్ చేయండి. ఇప్పుడు మీకు ఫ్లాష్ ఆఫ్  క్యాన్సిల్‌, ఓకే అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.  ఓకే అనేదానిపై టాప్ చేయండి.    ఇక మీకు ఫ్లాష్ మెసేజ్‌లు రావు.  

జన రంజకమైన వార్తలు