• తాజా వార్తలు

ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తో ఫోటోలు తీయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో కొత్త ఫీచ‌ర్‌.. కొన్ని సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, కొన్ని హార్డ్‌వేర్ మెరుగుప‌రిచేవి. ఇలాంటి  కోవ‌లోనే వ‌చ్చింది ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌. నెంబ‌ర్ లాక్, ప్యాట్ర‌న్ లాక్ త‌ర్వాత సెల్‌ఫోన్ సెక్యూరిటీలో వ‌చ్చిన మేజ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇది. మీరు ముందుగా రిజిస్ట‌ర్ చేసుకున్న మీ ఫింగ‌ర్ ప్రింట్‌తోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డం దీని స్పెష‌ల్.  ఇదొక్క‌టే కాదు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఉప‌యోగించి ఫోటోలు కూడా తీసుకోవ‌చ్చు.

కొత్త కొత్త టాస్క్‌ల‌తో..

గూగుల్ పిక్సెల్‌, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ బేస్డ్ గెస్చ‌ర్స్‌తో వ‌చ్చాయి. ఇదే మాదిరిగా హువావే నుంచి వ‌చ్చే ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌కు EMUI skin layerను ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నారు.  LG V20లో అయితే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌ను ప‌వ‌ర్ బ‌ట‌న్‌తో ఇంటిగ్రేట్ చేశారు.

ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌తో ఫొటోలు తీసే విధానం

1.  కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్లు కెమెరా యాప్‌ను స‌పోర్ట్ చేయాలి. లేక‌పోతే ప్లే స్టోర్ నుంచి  డాక్టిల్ (Dactyl) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. యాప్‌ను డౌన్‌లోడ్ చేశాక‌, మెయిన్‌పేజీలో   Open Settings Page ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఈ ఆప్ష‌న్‌లోకి వెళితే యాక్సెస‌బిలిటీ కాన్ఫిగ‌రేష‌న్స్‌. ప‌ర్మిష‌న్స్ సెట్టింగ్స్ క‌నిపిస్తాయి.

3. మీరు యాప్స్‌కు కావాల్సిన ప‌ర్మిష‌న్లు అన్నీ ఇచ్చాక ఆ యాప్స్ అన్నింటికీ Dactyl supports ఉన్న‌ట్లు చూపిస్తుంది. కెమెరా ఫంక్ష‌నాలిటీ ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి యాప్స్ అన్నింటికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది. 

4) ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా యాప్‌ను ఓపెన్ చేయండి.  షట్ట‌ర్ బ‌ట‌న్‌పైన  Dactyl Service Running అనే నోటిఫికేష‌న్ క‌నిపిస్తుంది.  ఇప్పుడు మీ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ మీద వేలుపెట్టి ఫొటోలు తీసుకోవ‌చ్చు. 

అయితే Dactyl  యాప్ ట్ర‌య‌ల్ వెర్ష‌న్ మాత్ర‌మే ఫ్రీ.  10 సార్లు యూజ్ చేశాక ఇంకా కావాలంటే ప్లే స్టోర్లో నుంచి ప‌ర్చేజ్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు