• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఉప‌యోగించ‌డం ఎలా?

గూగుల్ యాప్స్‌... స్మార్ట్‌ఫోన్ల‌లో అత్యంత ఉప‌యోగ‌ప‌డే ఆప్ష‌న్ ఇది. క‌మ్యునికేష‌న్లో వ‌చ్చిన అతి పెద్ద విప్ల‌వాల్లో ఇదొక‌టి. ఎందుకంటే మ‌నం ఎక్క‌డ ఉన్నామో.. ఎటు వెళ్తున్నామో అంద‌రికి తెలియ‌జెప్పేలా... అంద‌రికి తెలిపిలా... లేదా మ‌న‌కు కావాల్సిన అడ్రెస్‌ల‌ను క‌నుక్కునేలా చేయ‌డానికి మ్యాప్ ఫీచ‌ర్‌కు మించింది లేదు.  ఈ మ్యాప్ ఆప్షన్ సర‌ళంగా సుల‌భంగా వ‌ర్కౌట్ కావాలంటే మ‌న‌కు మంచి స్టేబుల్‌గా ఉండే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ కూడా ఎంతో అవ‌స‌రం.  అయితే ఇంట‌ర్నెట్ లేక‌పోతే... మ్యాప్ ఆప్ష‌న్ ఉన్నా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. నెట్ ఉంటేనే దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌నం ఎక్క‌డ ఉన్నామో చూపించాలంటే నెట్ నిరంత‌రాయంగా ఆన్‌లో ఉండాలి. అయితే ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా మ్యాప్‌ల‌ను ఉప‌యోగించుకోగ‌లిగితే! అదెలా అంటారా? ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ డివైజ్‌ల‌లో ఆఫ్‌లైన్‌లోనూ మ్యాప్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. మ‌రి అదెలాగో చూద్దాం...

ఏం చేయాలంటే..
1. ముందుగా మ్యాప్ ఫీచ‌ర్‌ను మీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో మ్యాప్ ఆప్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేయాలి. మీరు ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయి ఉండి ఆ త‌ర్వాత గూగుల్ మ్యాప్ ఆప్ష‌న్‌తో సైన్ఇన్ కావాలి.

2. మీకు కావాల్సిన ప్రాంతం లేదా అడ్రెస్ కోసం ఈ మ్యాప్‌ల ఆప్ష‌న్‌లో వెత‌కాలి. మ్యాప్‌ల కింద భాగంలో ఆ ఏరియా పేరు, అడ్రెస్‌ను టైప్ చేసి ట్యాప్ చేయాలి.

3. ఆ త‌ర్వాత ఆఫ్‌లైన్ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

4. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో అయితే గూగుల్ మ్యాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి

5.ముందుగా మీరు ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయి ఉండి గూగుల్ మ్యాప్‌తో సైన్ ఇన్ కావాలి.

6. ఆ త‌ర్వాత మీకు కావాల్సిన ఏరియా లేదా అడ్రెస్ కోసం సెర్చ్ చేయాలి

7. మ్యాప్‌ల చివ‌ర్లో ఉండే సెర్చ్‌లో ఏరియా అడ్రెస్‌, ప్లేస్‌ను టైప్ చేయాలి . ఆ త‌ర్వాత ఆ మ్యాప్‌ను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయాలి

8. మీరు ఏదైనా రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తే.. ట్యాప్ మోర్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత  ఆఫ్ లైన్‌లో డౌన్‌లోడ్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు