• తాజా వార్తలు

ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీల‌ను వెరిఫై చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఇప్ప‌డు అన్నీ ఆధార్‌తోనే లింక్‌. ఏం చేయాల‌న్నా ఆధార్‌..  ఏది కావాల‌న్నా ఆధార్‌! అయితే కొన్నింటింకి మ‌నం ఆధార్‌ను లింక్ చేసుకుంటాం. కొన్నింటిని మ‌రిచిపోతాం. కానీ కీల‌క స‌మ‌యాల్లో అది ఇబ్బందిగానే మారుతుంది. మ‌రి ఇలాంటి స్థితిలో ఆన్‌లైన్ ద్వారా మ‌న ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న  మొబైల్ నంబ‌ర్‌,  ఈమెయిల్ ఐడీల‌ను  తెలుసుకోవ‌డం ఎలాగో చూద్దాం..

ఎలా చేయాలంటే..
ఆధార్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆధార్ స‌ర్వీసులు ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. వెరిఫై ఈమెయిల్ లేదా మొబైల్ నంబ‌ర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకో పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో మీ ఆధార్  నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ  ఫిల్ చేయాలి. ఆ త‌ర్వాత సెక్యూరిటీ కోడ్ కూడా బ్లాంక్ బాక్స్‌లో ఎంట‌ర్ చేయాలి.  ఆ డిటైల్స్ ఫిల్ చేసిన త‌ర్వాత గెట్ వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ మీద క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడీ,  మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని మీకు క‌నిపించే ఎంప్టీ బాక్స్‌లో ఎంట‌ర్ చేసి వెరీఫై ఓటీపీపై క్లిక్ చేయాలి

లింక్ అయితే...
మీ మొబైల్ నంబ‌ర్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే మీరు నేరుగా ఆధార్ వెబ్‌సైట్ హోమ్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.  మీ నంబ‌ర్‌, మీ ఈమెయిల్ ఐడీ వెరిఫై అయిన‌ట్లు మీకు సందేశం వ‌స్తుంది. మీరు మొబైల్ నంబ‌ర్ ఒక‌సారి వెరిఫై చేసుకున్న త‌ర్వాత మీరు ఎంట‌ర్ చేసిన మొబైల్ నంబ‌ర్ ఇప్ప‌టికే మా రికార్డుల్లో రిజిస్టర్ అయి ఉంది అనే సందేశం మీకొస్తుంది. మీ మొబైల్ నంబ‌ర్, ఈమెయిల్ ఐడీ రిజిస్ట‌ర్ కాక‌పోతే మీరు అస‌లు ఓటీపీ ప్రాసెస్ వ‌ర‌కు కూడా వెళ్ల‌లేరు.  

లింక్ కాకపోతే..
మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ మా రికార్డులకు మ్యాచ్ కావాట్లేదు అని ముందుగానే మ‌న‌కు ఒక మెసేజ్ వ‌స్తుంది.  మీ మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ ఇప్ప‌టికే ఆధార్‌తో లింక్ అయి ఉంటే ఎస్ఎస్‌యూపీ పోర్ట‌ల్ ద్వారా వాటిని మార్చుకునే అవ‌కాశం ఉంటుంది.  మీ మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఇప్ప‌టికే ఆధార్‌తో లింక్ కాక‌పోతే మీ ద‌గ్గ‌ర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లి అప్‌డేట్ చేయించుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు