• తాజా వార్తలు

గూగుల్‌కి మీ గురించి ఏం తెలుసో తెలుసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

గూగుల్‌... మ‌నం కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే మొద‌ట ఉప‌యోగించేది ఈ సైట్‌నే. మ‌న‌కు ఏం కావాల‌న్నా.. దేని గురించి తెలుసుకోవాల‌న్నా మొద‌ట ఈ సెర్చ్ ఇంజ‌న్‌ని క్లిక్ చేస్తాం.  దాదాపు ప్ర‌తిరోజూ మ‌న‌కు గూగుల్‌లో యాక్టివిటీ ఉంటుంది. అయితే మ‌నం ఏం చేసినా.. గూగుల్‌లో రికార్డు అవుతుంద‌న్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. గూగుల్ మ‌న యాక్టివిటీస్ మీద ఒక క‌న్నేసి ఉంచుతుంది. అయితే  ఏదో మ‌న‌ల్ని ట్రేస్ చేయ‌డం కోసం కాదు. మ‌న బ్రౌజింగ్‌కు త‌గ్గ యాడ్స్‌ను ప్లేస్ చేయ‌డానికి.. మ‌న‌కు సంబంధించిన లింక్‌ల‌ను అందించ‌డానికి. అయితే గూగుల్‌కు మ‌న గురించి  ఎంత తెలుసో తెలుసుకోవ‌డం ఎలా?

మై యాక్టివిటీ
మ‌న‌కు సంబంధించిన అన్ని యాక్టివిటీల‌ను గూగుల్ ఒక ప్లేస్‌లో భ‌ద్రం చేసింది. మ‌నం ఇందులోకి వెళితే ఎప్పుడు ఏం చేశామో.. స‌మ‌యం, తేదీతో స‌హా అంతా వ‌చ్చేస్తుంది. 2009లో గూగుల్ ఈ యాక్టివిటీ ట్రాక‌ర్‌ను ప్ర‌వేపెట్టింది. దీనిలో భాగంగానే మై యాక్టివిటీ, మై అకౌంట్ పేరుతో డాష్‌బోర్డ్‌ను కూడా ఏర్పాటు చేసింది.  సెట్టింగ్స్‌లోకి వెళ్లి మై యాక్టివిటీ మీద క్లిక్ చేసి మై అకౌంట్‌లోకి వెళితే చాలు మీకు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారం స్టోర్ అయి ఉంటుంది. మీరు గూగుల్‌లో బ్రౌజ్ చేసిన యాక్టివిటీతో పాటు మీరు ఎన్ని మెయిల్స్ పంపించారు.. ఎన్ని ఫొటోలు స్టోర్ చేశారు లాంటి వివ‌రాల‌న్నీ మై యాక్టివిటి ఫీచ‌ర్ క‌న‌బ‌డ‌తాయి. 

రీ డిజైన్‌తో...
గూగుల్ ఇటీవ‌లే ఈ డాష్‌బోర్డును రీ డిజైన్ చేసింది. ప్రైవ‌సీ, సెక్యూరిటీ డాష్‌బోర్డుగా దీన్ని మార్చింది.  ట‌చ్ స్క్రీన్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల‌తో ఇంట్రిగేట్ చేయ‌డం కోసం ఈ మార్పులు చేసిన‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది.  మీకు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు అందించేందుకు గూగుల్ ఈ డాష్‌బోర్డుకు  గ్రాఫిక్స్‌ను కూడా జోడించింది. ప్ర‌స్తుతం ఉన్న వెర్ష‌న్ నేవిగేష‌న్‌కు ఇబ్బందిగా ఉండ‌డంతో ఇందులో మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 150 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు త‌మ ఓల్డ్ లింక్స్‌, వీడియోల కోసం మై యాక్టివిటీ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకున్నార‌ని గూగుల్ తెలిపింది.  ఇందులో ఉన్న టేక్ ఔట్ ఫీచ‌ర్ సాయంతో మీరు గూగుల్‌లోని డేటాను బ‌య‌ట‌కు తీసుకోవ‌చ్చు. అంటే ఇదో ఎక్స్‌పోర్ట్ మాదిరిగా ప‌ని చేస్తుంది.  త్వ‌ర‌లో అప్‌డేటెడ్ వెర్ష‌న్ ద్వారా గూగుల్ డాష్‌బోర్డు అందుబాటులోకి వ‌స్తుంద‌ని గూగుల్ తెలిపింది. 
 

జన రంజకమైన వార్తలు