ఇండియాలో మొత్తం 81 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ మినిస్టర్ పీపీ చౌధురి ఇటీవల రాజ్యసభలో అనౌన్స్ చేశారు. అయితే ఎందుకు, ఎలా అనే రీజన్స్ చెప్పలేదు. ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ Aadhaar Life Cycle Management (ALCM) లోని 27, 28 సెక్షన్ల కింద రకరకాల కారణాలతో ఆధార్‌కార్డును డీయాక్టివేట్ చేసేందుకు UIDAI authorityకి అధికారం ఉంది. ఒకే ఆధార్ డిటెయిల్స్‌తో ఎక్కువ మంది ఉన్నా, ఒకేరకమైన బయోమెట్రిక్ (వేలిముద్రలు) వంటివి ఎక్కువ కార్డులకు ఉన్నా, 5లోపు పిల్లలకు ఆధార్ తీసుకున్నప్పుడు వారికి ఐదేళ్లు వచ్చాక మళ్లీ అప్డేట్ చేయించుకోకపోయినా ఆధార్ కార్డు డీయాక్టివేట్ కావచ్చు.
మీ ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవాలంటే..
1) UIDAI మెయిన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో Aadhaar Services సెక్షన్లో ఉన్న Verify Aadhaar Number ట్యాబ్ ను క్లిక్ చేయాలి.
2)Verify Aadhaar Number ట్యాబ్ క్లిక్యచేయగానే అది మరోపేజీలోకి రీ డైరెక్ట్ అవుతుంది. ఈ పేజీలో మీ ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Verify బటన్ క్లిక్ చేయాలి.
3) మీ ఆధార్ నెంబర్ యాక్టివ్‌గా ఉంటే లాస్ట్ పేజీలో మీ డిటెయిల్స్‌తోపాటు Active అని చూపిస్తుంది.
యాక్టివ్‌గా లేకపోతే..
మీ ఆధార్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ డిటెయిల్స్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు అవసరమైన డాక్యమెంట్స్ అన్నీ మళ్లీ సబ్మిట్ చేయాలి.
* ఆధార్ అప్డేట్ ఫాంను ఫిల్ చేసి, మీ బయోమెట్రిక్స్‌ను రీవైరిఫూ చేయించుకోవలి.
* ఇందుకు 25 రూపాయలు ఛార్జి కూడా చెల్లించాలి.