• తాజా వార్తలు
  •  

స్లో నెట్‌వ‌ర్క్‌ల‌లో ఇంట‌ర్నెట్‌ స్పీడ్‌ను పెంచ‌డం ఎలా?

ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ ఇంట‌ర్నెట్ వేగంగా రావాలనే ఉంటుంది. ఎందుకంటే ప‌ని వేగంగా జ‌ర‌గాల‌న్నా.. బ‌ఫ‌రింగ్ లేకుండా క్వాలిటీ వీడియోలు చూడాల‌న్నా.. హెచ్‌డీ క్వాలిటీ కావాల‌న్నా వేగంగా ఉండే ఇంట‌ర్నెట్ చాలా అవ‌స‌రం. వేగంగా ఉండే ఇంట‌ర్నెట్ ఉండ‌డం వ‌ల్ల బ‌ఫ‌రింగ్ లేకుండా ఈ వీడియోలు చూడట‌మే కాదు.. వీడియో చాట్ కూడా చేసుకోవ‌చ్చు.  అయితే స్లో నెట్‌వ‌ర్క్‌ల‌తో మ‌న‌కు చిక్కొచ్చి ప‌డుతుంది.. అన్నినెట్‌వ‌ర్క్‌ల‌లో మ‌నం ఇంట‌ర్నెట్‌ను వేగంగా వాడుకోలేం. త‌క్కువ స్పీడ్ వ‌ల్ల మ‌న ప‌ని ఆగిపోతుంది. మీ వెబ్‌సైట్ వేగంగా ఉండాలంటే నెట్ వేగంగా ఉండాలి. మ‌రి నెట్ స్పీడ్‌ను ఎలా పెంచాలో తెలుసుకుందామా..

గూగుల్ ట్రాన్సాకోడ‌ర్ ట్రిక్ 
గూగుల్ ట్రాన్స్‌కోడ‌ర్ ట్రిక్ ద్వారా మీరు ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవ‌చ్చు. ఈ ట్రాన్స్‌కోడ‌ర్ మీ వెబ్‌సైట్‌ను వాప్‌సైట్‌గా మార్చేస్తుంది. మీ సైట్లో ఉన్న ఇమేజ్‌ల‌ను, ఇత‌ర కంటెంట్‌ను ఆప్టిమైజ్ చేయ‌డం వ‌ల్ల  ఇంట‌ర్నెట్‌ను స్పీడ్‌గా సర్ఫ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

1. ఏ బ్రౌజ‌ర్‌లో అయినా గూగుల్ ట్రాన్స్‌కోడ్‌ను ఓపెన్ చేయాలి

2. మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను అక్క‌డ పేస్ట్ చేయాలి

3. గో మీద క్లిక్ చేయాలి... అంతే మీ వెబ్‌సైట్‌ను వేగంగా బ్రౌజ్ చేసే అవ‌కాశం ఉంటుంది.

రాబ్‌.ఇట్ ద్వారా హైస్పీడ్ ఇంట‌ర్నెట్ వాడాలంటే...
హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించుకోవాలంటే మ‌రో మార్గం రాబ్‌.ఇట్.  ముందుగా రాబ్‌.ఇట్ వెబ్‌సైట్లోకి వెళ్లాలి. మీరు ఇందులో ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత లాగిన్ కావాలి. ఇందుకు మీ మెయిల్‌ను వెరిఫై చేసుకోవాలి. అప్పుడు మీకో స్క్రీన్ వ‌స్తుంది. దానిలో మీరు ఏం చూడాలో... ఏం బ్రౌజ్  చేయాలో అన్ని వివ‌రాలు ఉంటాయి.  బ్రౌజ‌ర్ అడుగు భాగంలో మీరు టీవీలాంటి సింబ‌ల్ చూడొచ్చు. దీనిలో ఓపెన్ అయిన పాప‌ప్‌ను ఓపెన్ చేసి మీ యూఆర్ఎల్‌ను ఎంట‌ర్ చేయాలి. అంతే.. మీరు 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంట‌ర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు.

రాబ్‌.ఇట్ ఫీచ‌ర్లు ఇవే...
1. రాబ్‌.ఇట్ ద్వారా ప్ర‌పంచంలో ఎవ‌రితోనైనా క‌మ్యునికేట్ చేయ‌చ్చు. కంటెంట్ షేర్ చేయ‌చ్చు

2. రాబ్‌.ఇట్ వాడ‌డం వ‌ల్ల సినిమాలు, టీవీ షోలు, ఇత‌ర యూట్యూబ్ వీడియోలు చూసే అవ‌కాశం ఉంటుంది.

3.  ఇది పూర్తిగా నిరంత‌రాయంగా న‌డిచే నెట్‌వ‌ర్క్, ఉచితంగా వాడుకోవ‌చ్చు.

4. దీనిలో ఉన్న రాబిట్‌కాస్ట్ ద్వారా మ‌నం ఏ వెబ్‌సైట్ అయినా ఏ వీడియో అయినా బ్రౌజ్ చేయ‌చ్చు.

జన రంజకమైన వార్తలు