• తాజా వార్తలు
  •  

జియో ఓచ‌ర్ల‌ను కొన‌డం, ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం, గిఫ్ట్ ఇవ్వ‌డం ఎలా?

జియో వేగం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్ర‌త్య‌ర్థి నెట్‌వ‌ర్క్‌లు ఎన్ని ఆఫ‌ర్లు పెట్టినా జియో ఇచ్చిన ఆఫ‌ర్లు జ‌నాల‌కు న‌చ్చేయ‌డంతో ఈ సంస్థ దూసుకెళ్తోంది. 2018లోనూ టెలికాం మార్కెట్లో మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ఆ సంస్థ కొత్త వ్యూహాల‌తో ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టికే ఆ సంస్థ ప్ర‌క‌టించిన ఓచ‌ర్ల ఆఫ‌ర్ కూడా వినియోగ‌దారుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. జియో యాప్‌లో ఉన్న మై జియో ఓచ‌ర్ ఆప్ష‌న్‌ను ఎలా ఉప‌యోగించుకోవాలో చాలామందికి తెలియ‌దు. ఈ ఓచ‌ర్ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎలా రీఛార్జ్ చేయించుకోవాలో తెలుసుకుందామా!

జియోలో మాత్ర‌మే...
జియో ప్రవేశ‌పెట్టిన మై జియో ఆప్ష‌న్‌ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఎందుకంటే ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ లాంటి కంపెనీలు ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి మై ఓచ‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఓచ‌ర్ల‌ను ఉప‌యోగించుకుని బ్యాలెన్స్‌ను ట్రాన్స‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌లేదు. కానీ జియో త‌మ క‌స్టమ‌ర్ల‌కు ఆ అవ‌కాశాన్నిఇచ్చింది. జియో ఓచ‌ర్ల‌ను మీ లైఫ్ టైమ్‌లో ఎప్పుడైనా ఉప‌యోగించుకోవ‌చ్చు.  ఎందుకంటే ఒక‌సారి వీటిని కొనుగోలు చేసిన త‌ర్వాత అవి మీ జియో అకౌంట్లో ఎప్ప‌టికీ అలాగే ఉండిపోతాయి. మీ జియో బ్యాలెన్స్‌ను  వేరే జియో యూజ‌ర్ల‌కు కూడా మీరు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది.  వీటిని ఉప‌యోగించి మీరు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవ‌చ్చు.

ఎలా ఉప‌యోగించుకోవాలంటే..
1. మై జియో యాప్ ఓపెన్ చేయాలి

2. మెనూపై క్లిక్ చేయ‌గానే మీకు మై ప్లాన్స్‌పైన మై ఓచ‌ర్స్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

3. మై ఓవ‌ర్స్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేస్తే మీకు మీ  ఓవ‌ర్ వివ‌రాలు క‌నిపిస్తాయి

4. ఓచ‌ర్లు లేక‌పోతే కొనుక్కోవ‌చ్చు.  బై అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి ఓవ‌ర్ విలువ‌ను ఎంట‌ర్ చేయాలి

5. జియో మ‌నీ వాలెట్‌ను ఉప‌యోగించి మీకు కావాల్సిన విలువ‌గ‌ల ఓవ‌ర్ల‌ను డ‌బ్బులు చెల్లించి కొనుక్కోవాలి

జియో వోచ‌ర్ కోడ్ ఎలా చూడాలంటే..
1. మై జియో యాప్‌లో వ్యూ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

2. మీ త‌ర్వాత రీఛార్జ్ కోసం లేదా ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌డానికి అందుబాటులో ఉన్న ఓచ‌ర్ కోడ్స్‌ను మీరు చూడొచ్చు

3. మీకు ఎవ‌రైనా ఓచ‌ర్ల‌ను పంపించినా దాన్ని కూడా మీరు వ్యూ ఆప్ష‌న్‌లో చూడొచ్చు

జియో బ్యాలెన్స్ ఎలా పంపాలంటే...
1. మై జియో యాప్‌లో ఫీచ‌ర్ కింద ఉన్న ట్రాన్స‌ఫ‌ర్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి

2. మీ ఫ్రెండ్స్ జియో నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి

3. వోచర్ విలువ‌ను కూడా ఎంట‌ర్ చేయాలి

4. ఆ త‌ర్వాత ట్రాన్స‌ఫ‌ర్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఇన్‌స్టంట్‌గా మీ అకౌంట్లో అమౌంట్ మీ స్నేహితుల‌కు వెళ్లిపోతుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు