• తాజా వార్తలు
  •  

వ‌న్ ప్ల‌స్ యూజ‌ర్ డేటాను కొట్టేస్తుంది.. దాన్ని ఆప‌డం ఎలా?

వ‌న్ ప్ల‌స్ మొబైల్ గురించి అంద‌రికి తెలుసు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న హై ఎండ్ ఫోన్ల‌లో వ‌న్ ప్ల‌స్ ఒక‌టి. అయితే ఇటీవ‌లే ఈ ఫోన్ గురించి ఊహించ‌ని విష‌యంలో ఒక‌టి బ‌య‌ట‌కొచ్చింది. అదే ఆ మొబైల్.. యూజ‌ర్ల‌కు తెలియ‌కుండా డేటాను దొంగిలిస్తుంద‌ట‌! విన‌డానికి విడ్డూరంగానే ఉన్నా.. ఇది నిజ‌మ‌ని చెబుతున్నాయి ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు. మ‌రి డేటాను కొట్టేస్తున్న‌ వ‌న్‌ప్ల‌స్ చ‌ర్య‌ల‌ను ఆప‌డం ఎలా? మ‌న డేటాను ర‌క్షించుకోవ‌డం ఎలా?  

బ‌య‌ట‌ప‌డిందిలా..
వ‌న‌ప్ల‌స్ కంపెనీ మ‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త డేటాను క‌లెక్ట్ చేస్తుంద‌నే విష‌యాన్ని  క్రిస్ట‌ఫ‌ర్ మూర్ అనే అత‌ను క‌నిపెట్టాడు. త‌న‌కు చెందిన వ‌న్‌ప్ల‌స్ 2 మొబైలోని డేటాను త‌న‌కు తెలియ‌కుండానే హెచ్‌టీటీపీఎస్ డొమైన్‌కు మ‌ళ్లిన‌ట్లు అత‌ను గుర్తించాడు. ఈ డేటా ఓపెన్ వ‌న్‌ప్ల‌స్ నెట్ డొమైన్‌కు వెళ్లిన‌ట్లు కూడ క‌నుగొన్నాడు.  వ‌న్‌ప్ల‌స్ మొబైల్‌కు సంబంధించిన స్క్రీన్, సీరియ‌ల్ నంబ‌ర్‌, ఐఎంఈఐ, మాక్ అడ్రెస్ ,డివైజ్ అన్‌లాక్ ప్యాట్ర‌న్స్‌,  పాస్‌వ‌ర్డ్స్‌, ఐఎంఎస్ఐ నంబ‌ర్లు, మొబైల్ నెట్‌వ‌ర్క్ పేర్లు, అబ్‌నార్మ‌ల్ రీబూట్స్ లాంటి కీల‌క స‌మాచారాన్ని వ‌న్‌ప్ల‌స్ కొట్టేసింది. వ‌న్‌ప్ల‌స్‌కు సంబంధించిన ఆక్సిజ‌న్ ఓఎస్‌.. వ‌న్‌ప్ల‌స్ డివైజ్‌లోని డేటాను క‌లెక్ట్ చేసి వాట‌న్నిటిని వ‌న్‌ప్ల‌స్ డొమైన్‌కు షేర్ చేసింది. దీనికి వ‌న్‌ప్ల‌స్ డివైజ్ మేనేజ‌ర్‌, వ‌న్‌ప్ల‌స్ మేనేజ‌ర్ ప్రొవైడ‌ర్ హెల్ప్ చేస్తున్నాయి.  ఇవి క‌లెక్ట్ చేస్తున్న డేటాలో మ‌న యాప్‌ల‌లోని డేటా కూడా ఉంది. 

డేటా చౌర్యాన్ని ఆప‌డం ఎలా? 
మీరు వ‌న్‌ప్ల‌స్ మొబైల్ యూజ‌ర్ అయితే మీరు డేటా షేరింగ్ ఆప్ష‌న్‌ను ప‌ర్మినెంట్‌గా డిజేబుల్ చేస్తే చాలు ఈ డేటా చౌర్యాన్ని ఆపొచ్చు.  స్మార్ట్‌ఫోన్ కార్య‌కలాపాల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా డేటాను షేరింగ్‌ను ఆపేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వ‌న్స‌డ్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేసిన జాయిన్ యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ ప్రొగ్రామ్ ఆనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. లేక‌పోతే  మీకు ఇంకా ఇబ్బందులు ఉంటే వెంట‌నే  911కు కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చు. ఒక్కోసారి ఇది ఒక బ‌గ్‌లా మ‌న ఫోన్లో చొర‌బ‌డ‌చ్చు. అప్పుడు వెంట‌నే రీబూట్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు