• తాజా వార్తలు
  •  

ఆర్ఎఫ్ఐడీ టెక్నాల‌జీతో కూడిన పేటీఎం ఫాస్ట్‌టాగ్ ఎలా ప‌ని చేస్తుంది? 

ఇండియాలో నేష‌న‌ల్ హైవేల‌న్నీ ఇప్పుడు ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట‌న‌ర్ షిప్‌తోనే వేస్తున్నారు. దీంతో పెట్టుబ‌డి పెట్టిన ప్రైవేట్ కంపెనీ కొన్నేళ్ల‌పాటు టోల్ వ‌సూలు చేస్తుంది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఇండియాలో మ‌నం హైవే మీద వెళ్లాలంటే టోల్ ఫీజు క‌డుతూ వెళ్లాల్సిందే. ఓ 500 కిలోమీట‌ర్లు జ‌ర్నీ చేయాలంటే 7,8టోల్ గేట్లు దాటాలి. ప్ర‌తి టోల్‌గేట్ ద‌గ్గ‌ర ఆగ‌డం, లైన్‌లో వెళ్లి డ‌బ్బులిచ్చి రిసీట్ తీసుకోవ‌డం ఇదంతా క‌నీసం 5 నిముషాల ప‌ని. పైగా చిల్ల‌ర కోసం తంటా. దీంతోపాటు ఫ్యూయ‌ల్ కూడా వేస్ట్‌. ఫాస్టాగ్‌తో ఈ బాధ‌ల‌న్నీ తీరాయి. 
ఏమిటీ ఫాస్టాగ్‌? 
ఇవ‌న్నీ లేకుండా ఫాస్ట్‌టాగ్ తీసుకుంటే ఆన్‌లైన్‌లోనే కార్డు రీఛార్జి చేయించుకోవ‌చ్చు. ఏ వెహిక‌ల్‌కు తీసుకున్నామో ఆ వెహిక‌ల్ ఫ్రంట్ మిర్ర‌ర్‌కు ఫాస్ట్‌టాగ్ అతికించుకోవాలి.  ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ టెక్నాల‌జీ)తో ప‌ని చేస్తుంది.  ఇండియాలో ఉన్న ఇంచుమించు అన్ని టోల్‌గేట్ల‌లో ఫాస్టాగ్ రీడ‌ర్స్ ఉన్న స్పెష‌ల్ లైన్ ఒక‌టి ఉంటుంది. అక్క‌డ ఉండే సెన్స‌ర్ దూరం నుంచే ఫాస్టాగ్‌ను గుర్తించి గేట్ ఓపెన్ చేస్తుంది.  ర‌య్‌మంటూ దూసుకెళ్లిపోవ‌చ్చు. మీరు టోల్‌గేట్ దాట‌గానే మీ కార్డు బ్యాల‌న్స్‌లో నుంచి టోల్ ఫీజ్  ఆటోమేటిగ్గా క‌ట్ అయిపోతుంది.  ఇప్పుడు పేటీఎం ద్వారా కూడా ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకోవ‌చ్చు.
డిసెంబ‌ర్ 1 నుంచి..
డిసెంబ‌ర్ 1 నుంచి అమ్మే ప్ర‌తి ఫోర్ వీల‌ర్, అంత‌కంటే పెద్ద వెహిక‌ల్స్  డైరెక్ట్‌గా ఫాస్టాగ్‌తోనే అమ్ముతారు. ఇది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రూల్‌.  ఇండియాలో 380 టోల్‌గేట్ల‌లో ఫాస్టాగ్ రీడ‌ర్ యాక్సెస‌బులిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అతి త్వ‌రలో  అన్ని టోల్‌గేట్ల‌లో ఇదే ప‌ద్ధ‌తి రాబోతోంది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు