• తాజా వార్తలు

యాక్సిడెంట‌ల్‌గా డిస్మిస్ అయిన నోటిఫికేష‌న్ల‌ను రీస్టోర్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

స్మార్ట్‌ఫోన్ నిండా బోల్డ‌న్ని యాప్‌లు.. వాటి నుంచి వ‌చ్చే నోటిఫికేష‌న్లు, ఇవికాక కాల్స్‌, మెసేజ్‌ల నోటిఫికేష‌న్లు వ‌స్తూనే ఉంటాయి. ఒక్కోసారి  వాటిని చూడ‌కుండానే డిస్మిస్ చేసేస్తుంటాం. అందులో ఇంపార్టెంట్ నోటిఫికేష‌న్ ఉంటే అయ్యో అనుకుంటాం. అలా డిస్మిస్ చేసిన నోటిఫికేష‌న్ల‌ను రీస్టోర్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అదెలాగో చూడండి.  
ఆండ్రాయిడ్‌లో నోటిఫికేష‌న్ హిస్ట‌రీ లాగ్ అనే కొత్త యాప్ ఉంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్, ఆ త‌ర్వాత వ‌చ్చిన  త‌ర్వాత వ‌చ్చిన అన్ని ఓఎస్‌ల్లోనూ ఇది ప‌ని చేస్తుంది.  కాబ‌ట్టి ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ల‌న్నింట‌కీ ఇది ప‌ని చేస్తుంది. 
ఎలా వాడాలి? 
ఈ యాప్‌లో  మీ నోటిఫికేష‌న్ల‌న్నీ లోక‌ల్‌గా సేవ్ అవుతాయి.  నోటిఫికేష‌న్ హిస్ట‌రీ లాగ్  యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసి కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే ఇది మీ ఫోన్‌కు క‌న్ఫిగ‌ర్ అవుతుంది.  యాప్ ర‌డీ అయ్యాక మీకు యాప్ హోం స్క్రీన్ క‌నిపిస్తుంది. మీరు వాడుతున్న డివైస్‌, ఇందులో మీకు స‌పోర్ట్ చేసే ఫీచ‌ర్ల వివ‌రాలు చూపిస్తుంది.  అడ్వాన్స్‌డ్ హిస్ట‌రీ టాబ్‌ను క్లిక్ చే యండి. దీనిలో మీ రీసెంట్ నోటిఫికేష‌న్ల‌న్నీక‌నిపిస్తాయి. స్పెసిఫిక్ యాప్ లేదా ప‌ర్స‌న్ నుంచి వ‌చ్చే మెసేజ్ గురించి వెత‌క‌డానికి సెర్చ్ ఆప్ష‌న్ కూడా ఉంది.  టైం కూడా స్పెసిఫై చేసి సెర్చ్ చేసుకోవ‌చ్చు. యాప్ లాండింగ్ పేజీలో నుంచి మీ నోటిఫికేష‌న్ హిస్ట‌రీ క్లియ‌ర్ చేసి అడ్వాన్స్‌డ్ హిస్ట‌రీని సెట్ చేసుకోండి.   ఇది ఫ్రీ యాప్‌. అయితే 1.49 డాల‌ర్స్ పెడితే ప్రో వెర్ష‌న్ ఉంది. దీనిలో అన్‌లిమిటెడ్ నోటిఫికేష‌న్ స్టోరేజ్‌లాంటి ఎక్స్‌ట్రా ఫీచ‌ర్లు ఉన్నాయి.
 

జన రంజకమైన వార్తలు