• తాజా వార్తలు
  •  

ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

మీ ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఫ్రీ కాల్స్ చేయాలంటే ఎలా? స‌్కైప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వాయిస్ కాలింగ్‌..ఇలా ఆప్ష‌న్స్ లిస్ట్ చ‌దివేస్తున్నారా? ఆగండాగండి..అవ‌న్నీఇంట‌ర్నెట్ ఉంటేనే ప‌నిచేస్తాయి. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఓ లుక్కేయండి
స్పీక్ ఫ్రీ యాప్ 
ఇంట‌ర్నెట్ లేకుండా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌డానికి  సంభ‌వ్ క‌మ్యూనికేష‌న్స్ అనే సంస్థ ఓ యాప్‌ను త‌యారుచేసింది. దీని పేరు స్పీక్ ఫ్రీ (Speakfree).  దీని సైజ్ జ‌స్ట్ 2.5ఎంబీ. దీన్నిప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్‌చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత ఫ్రీ అకౌంట్ కోసం మీ పేరు, ఫేస్‌బుక్ ఐడీలాంటి సింపుల్ డిటైల్స్ ఎంట‌ర్ చేసి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
ఎలా వాడుకోవాలి? 
* యాప్ ఓపెన్ చేసి  మీరు కాల్ చేయాల‌నుకున్న నెంబ‌ర్ ఎంట‌ర్‌చేసి కాల్‌చేయాలి. 10 సెక‌న్ల‌లోగా కాల్ క‌నెక్ట్ అవుతుంది.
* ఒక‌వేళ మీకు కాల్ క‌నెక్ట్ కాక‌పోతే మ‌రో కాల్‌చేసి త‌ర్వాత ఈ నెంబ‌ర్ ట్రై చేస్తే వ‌ర్క‌వుట్ అవుతుంది.  హెవీ లోడ్‌తో ఒక్కోసారి కాల్ క‌ల‌వదు.రెండు, మూడుసార్లు ట్రైచేస్తే కాల్ క‌నెక్ట్ అవుతుంది.
* 18001231312 నెంబ‌ర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబ‌ర్ నుంచికాల్ చేయాలి.  కాల్ లిఫ్ట్‌చేయ‌గానే మీ ఫ్రెండ్ నెంబ‌ర్ ఎంట‌ర్‌చేసి ఫ్రీ కాల్ మాట్లాడుకోవ‌చ్చు. 
* ఒక కాల్ మూడు నిముషాల వ‌ర‌కు మాట్లాడుకోవ‌చ్చు. త‌ర్వాత క‌ట్ అయిపోతుంది.కావాలంటే సేమ్ ప్రొసీజ‌ర్‌తో మ‌ళ్లీ కాల్ చేసుకోవ‌చ్చు. 
* ఒక రోజులో ఇలా 30 నిముషాలపాటు కాల్స్ ఫ్రీ గా చేసుకోవ‌చ్చు.
* ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే మీరుకాల్ చేశాక ఒక యాడ్ వినిపిస్తుంది. 10 నుంచి 20సెక‌న్స్ ఉండే ఆ యాడ్ వింటేనే మీ కాల్ క‌నెక్ట్ అవుతుంది. ఆ యాడ్స్ ఆదాయ‌మే ఈ యాప్‌కు రెవెన్యూ అన్న‌మాట‌.  అంతేకాదు ఈ స్పీక్ ఫ్రీ యాప్ ఉద‌యం 9 నుంచి రాత్రి  9 గంట‌ల వ‌ర‌కు మాత్రమే ప‌నిచేస్తుంది.
 

జన రంజకమైన వార్తలు