• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఓరియోలో పిక్చ‌ర్‌లో పిక్చ‌ర్‌ని అనేబుల్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ ఓరియా.. గూగుల్‌లో కొత్త‌గా వ‌చ్చిన వెర్ష‌న్‌. అయితే దీనిలో కొత్త‌గా తీసుకొచ్చిన పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఫీచ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. దీంతో మ‌నం ఫోన్‌లో మ‌ల్టీ టాస్కింగ్ చేసే అవ‌కాశం ల‌భిస్తుంది. అంటే ఒకేసారి ఎక్కువ విండోస్ ఓపెన్ చేసి మ‌నం ప‌నులు చేసుకోవ‌చ్చు. అంటే మీరు ఒక‌వైపు వీడియో కాలింగ్ చేస్తూనే మ‌రోవైపు క్యాలెండ‌ర్ చెక్ చేసుకోవ‌చ్చు. లేదా మ్యూజిక్ సెట్ చేసుకోవ‌చ్చు. ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ కొత్తేమీ కాదు.  ఇప్పుడు వాటి స‌ర‌స‌న ఈ పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఫీచ‌ర్ వ‌చ్చి చేరింది.  ఆండ్రాయిడ్ ఓరియోలో ఈ కొత్త ఫీచ‌ర్‌ను అనేబుల్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం.. 

సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెనూలోని నోటిఫికేష‌న్స్ సెక్ష‌న్‌ను ఎంచుకోవాలి.

యాప్స్ మ‌రియు నోటిఫికేష‌న్స్ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత అడ్వాన్స్‌డ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. 

ఆ త‌ర్వాత స్పెష‌ల్ యాప్స్ మీద యాక్సిస్‌ క్లిక్ చేయాలి

స్పెష‌ల్  యాప్ యాక్సిస్ మీద క్లిక్ చేయ‌గానే  కొన్ని ఫీచ‌ర్ల లిస్ట్ వ‌స్తుంది.

పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఫీచ‌ర్‌ను స‌పోర్ట్ చేసే ఫీచ‌ర్‌ను మీరు ఇందులో చూడొచ్చు. 

ఇప్పుడు ఏమైనా యాప్‌ను క్లిక్ చేసి అన్‌బుల్ ద పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఫీచ‌ర్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. 

స్లైడ్ చేస్తూ అలౌ పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. 

ఎలా వాడాలంటే..
పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ అప్లికేష‌న్ ఓపెన్ చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు యూట్యూబ్‌లో ఒక వీడియో చూసి ఆ త‌ర్వాత హోమ్‌కు వ‌చ్చేయాల‌నుకుంటే.. పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ అప్లికేష‌న్ వ‌ల్ల వీడియో ఆటోమెటిగ్గా స్క్రీన్ సైజుకు త‌గ్గ‌ట్టుగా సెట్ అయిపోతుంది. అంటే ఒక‌వైపు వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. మ‌రోవైపు మీరు ఏదైనా యాప్‌ల‌ను తీసి వాడుకోవ‌చ్చు. ఈమెయిల్ చెక్ చేసుకోవ‌చ్చు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు చూడొచ్చు. చాటింగ్ చేసుకోవ‌చ్చు. ఆ ప‌ని అయిపోగానే.. వీడియో విండోను ట్యాప్ చేస్తే చాలు మ‌ళ్లీ ఫుల్ స్క్రీన్‌లో మ‌ళ్లీ వీడియో వ‌చ్చేస్తుంది.
 

జన రంజకమైన వార్తలు