• తాజా వార్తలు

క్యూఆర్ కోడ్ ఉప‌యోగించి  ఫోన్ నుంచి పీసీకి ఫోటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మ‌న ఫోన్లో  చాలా ఫొటోలు, వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి అవి ఎన్ని ఉన్నాయ‌న్న విష‌యాన్ని గురించి కూడా మ‌రిచిపోతాం. అయితే కొంత‌కాలానికి ఫోన్ నిండిపోయి మ‌న‌కు వార్నింగ్ వ‌చ్చే వ‌ర‌కు ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోం.  ఇదే కాదు మ‌నం ఎవ‌రికైనా ఫోన్ ఇవ్వాల‌నుకున్నా.. లేదా మ‌న ఫోన్‌ను ఎవ‌రికైనా అమ్మాల‌నుకున్నా ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు ఎలా తీయాలో కూడా తెలియ‌దు. కొంత‌మందైతే వాటిని తీయ‌కుండానే నేరుగా ఎక్స్‌ఛేంజ్ కూడా చేసేస్తారు. ఇది ప్ర‌మాద‌కరం కూడా. అయితే జ‌స్ట్ క్యూఆర్ కోడ్‌ను ఉప‌యోగించి ఫైల్స్‌, ఫొటోల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు అదెలాగో చూద్దాం..

స్కాన్ ట్రాన్స్‌ఫ‌ర్ సాయంతో..
స్కాన్ ట్రాన్స్‌ఫ‌ర్ అనేది ఒక ప‌వ‌ర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్‌. దీంతో సుల‌భంగా మీ ఫోన్ నుంచి ఫొటోల‌ను ఫైల్స్‌ను కంప్యూట‌ర్‌కు కాపీ చేయ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం వ‌స్తున్న స్మార్ట్‌ఫోన్ల‌లో చాలావ‌ర‌కు క్యూఆర్ కోడ్ ఇన్‌బిల్ట్‌గానే వ‌స్తోంది. ఇలాంటి స్థితిలో మీరు ఎలాంటి క్యూఆర్ కోడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. సింపుల్‌గా ఆ కోడ్‌ను ఓపెన్ చేసి యాక్టివేట్ చేసి మీకు పంపాల‌నుకున్న ఫైల్స్‌ను సెల‌క్ట్ చేసి పంపిస్తే స‌రిపోతుంది. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాని ప్ర‌కార‌మే ఫైల్స్‌ను పంపాలి.  మామూలుగా అయితే ఫోన్ నుంచి కంప్యూట‌ర్‌కు ఫైల్స్‌ను పంపాలంటే యూఎస్‌బీ కేబుల్‌ను ఉప‌యోగించేవాళ్లు. అయితే క్యూఆర్ కోడ్ ద్వారా వైర్‌లెస్‌గా మ‌నం ఈ ప‌ని చేసేయ‌చ్చు. దానికి మ‌నం కొన్ని స్టెప్స్ పాటించాలి.

ఎలా చేయాలంటే..
1.మీ పీసీలో స్కాన్ ట్రాన్స్‌ఫ‌ర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్‌, కంప్యూట‌ర్ ఒకే వైఫై క‌నెక్ష‌న్‌తో క‌నెక్ట్ అయి ఉందో లేదో చూసుకోవాలి. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేయ‌గానే దీని ఇంట‌ర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది. దీనిలోనే మీకు క్యూఆర్ కోడ్ క‌నిపిస్తుంది. మీరు ఏ ఫోల్డ‌ర్‌లోకి ఫైల్స్ పంపాలి, రిసీవ్ చేసుకోవాలో కూడా దీనిలో ఉంటుంది. 

2.క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అప్పుడు మీకో యూఆర్ఎల్ క‌నిపిస్తుంది. ఆ యూఆర్ఎల్‌ను ఏదైనా బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేయాలి. క్రోమ్ అయితే బెటర్‌.  ఆ యూఆర్ఎల్‌ను క్లిక్ చేయ‌గానే మీ ఫోన్లో ఏ ఫైల్స్ సెల‌క్ట్ చేయాలో అక్క‌డికి వెళుతుంది. 

3.మీకు కావాల్సిన ఫైల్స్‌ను సెల‌క్ట్ చేసి  ఓపెన్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.  అంతే మీ ఫోన్‌లో ఫైల్స్ పీసీకి సెండ్ చేసే ప్ర‌క్రియ మొద‌లువుతుంది . ఫైల్  ట్రాన్స్‌ఫ‌ర్ పూర్తి కాగానే మీ డెనిస్ట‌నేష‌న్ ఫోల్డ‌ర్‌లో ఆ ఫైల్స్ క‌న‌బ‌డ‌తాయి. ఆ త‌ర్వాత వాటిని మీరు ఎక్క‌డికైనా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు