• తాజా వార్తలు
  •  

ప‌గిలిపోయిన ఫోన్ నుంచి డేటాను  రిక‌వ‌ర్ చేసుకోవ‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్లో ఎంతో అవ‌స‌ర‌మైన డేటాను పొందుప‌రుస్తాం. ఫొటోలు, వీడియోలు మాత్ర‌మే కాదు.  మ‌న అర్థిక లావాదేవీలు ఇతర విలువైన స‌మాచారం మ‌న ఫోన్లోనే ఉంటుందిప్పుడు. ఒక‌ప్పుడు పాస్‌వ‌ర్డ్‌లు లాంటి వాటిని గుర్తు పెట్టుకునేవాళ్లం కానీ ఇప్పుడు అన్నీ ఫోన్ల‌లోనే దాచేస్తున్నాం. మ‌రి అలాంటి విలువైన ఫోన్ ఎక్క‌డైనా పోతే.. లేక‌పోతే ఫోన్ ఉన్న‌ట్టుండి ప‌గిలిపోతే ఎలా? మ‌న డేటా ప‌రిస్థితి ఏంటి? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే. కానీ దానికి స‌మాధానం ఏమిటి?  అయితే ప‌గిలిపోయిన ఫోన్ నుంచి కూడా డేటాను సంగ్ర‌హించే టెక్నాల‌జీ వ‌చ్చేసింది మ‌రెదెలాగో చూద్దామా..

ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..
ఎంతో ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత దాని గురించి ఎన్నో జాగ్ర‌త్త‌లు కూడా తీసుకుంటాం. దానిపై మంచి స్క్రీన్ క‌వ‌ర్  వేయిస్తాం. బ్యాక్ క‌వ‌ర్ కూడా బ‌లంగానే వేయిస్తాం. కానీ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఫోన్లు ప‌గ‌ల‌వ‌నే గ్యారెంటీ లేదు. ఏదో ఒక సంద‌ర్భంలో ఫోన్లు డ్యామేజ్ కావ‌డం ఖాయం. అందుకే చాలామంది త‌మ విలువైన డేటాను బ్యాక్ అప్ తీసుకుంటూ ఉంటారు. గూగుల్ డ్రైవ్‌, డ్రాప్  బాక్స్ లాంటి వాటిలో డేటాను దాస్తుంటారు. కానీ జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా.. డేటాను డ్రైవ్‌ల‌లో భ‌ద్ర‌ప‌ర‌చకుండా ఉండేవాళ్ల సంగ‌తి ఏమిటి? ..వారి విలువైన స‌మాచారం సంగ‌తి ఏమిటి? .. గొరిల్లా గ్లాస్‌లు..లేదా బ్యాక్‌, బుక్ క‌వ‌ర్లు అన్నిసార్లూ మ‌న ఫోన్‌ను కాపాడ‌లేవు.

టీమ్ వీవ‌ర్‌తో గ‌ట్టెక్క‌చ్చు..
టీమ్ వీవ‌ర్ సాయంతో మీ డేటాను ర‌క్షించుకోవ‌చ్చు. టీమ్ వీవ‌ర్ ఒక రిమోట్ స‌పోర్ట్ టూల్‌. మీ డివైజ్‌ను ఎక్స‌స్ చేయ‌డానికి, మీకు కావాల్సిన స‌మాచారాన్ని పొంద‌డానికి ఇది సాయం చేస్తుంది. ఇది ఫోన్లో మాత్ర‌మే కాదు పీసీలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీ ఫోన్ స్క్రీన్ మొత్తం పగిలిపోయినా కూడా మ‌నం టీవ్ వీవ‌ర్ సాయంతో ఆప‌రేట్ చేయ‌చ్చు. పీసీకి ఫోన్‌కు ఒకే బ‌ట‌న్స్‌ను ఉప‌యోగిస్తూ రెండింటిని ప‌ని చేసేలా చేయ‌చ్చు.  ఇందుకోసం ఫోన్లో టీమ్ వీవ‌ర్  ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఎలా ఉప‌యోగించాలంటే...
ముందుగా టీమ్ వీవ‌ర్ క్విక్ స‌పోర్ట్‌ను మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేక‌పోతే టీమ్ వీవ‌ర్ హోస్ట్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.  దీంతో మీకు ఐడీ అవ‌స‌రం ఉండ‌దు. కాక‌పోతే మీ ఫోన్ ద్వారా టీమ్ వీవ‌ర్ క్రెడెన్షియ‌ల్స్‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.  ఫోన్ ద్వారా కుద‌ర‌క‌పోతే వెబ్ నుంచి కూడా లాగ్ ఇన్ కావొచ్చు.

క్విక్ స‌పోర్ట్‌ను లాగిన్ చేశాక మీ స్క్రీన్ ఆఖ‌ర్లో ఒక నంబ‌ర్ క‌నిపిస్తుంది. ఆ నంబ‌ర్‌ను నోట్ చేసుకోవాలి. ఆ పై సెండ్ మై ఐడీ మీద క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత మీ కంప్యూట‌ర్‌లోకి వెళ్లి స్టార్ట్‌.టీమ్‌వీవ‌ర్‌.కామ్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ మీ ఐడీ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత క్లిక్ ఆన్ క‌నెక్ట్ పార్ట‌న‌ర్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇది మీ కంప్యూట‌ర్‌లో టీమ్ వీవ‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిపెడుతుంది. అలా క‌నెక్ట్ అయిన  త‌ర్వాత మీరు కంప్యూట‌ర్ నుంచే నేరుగా ఫోన్‌ను ఆప‌రేట్ చేయ‌చ్చు. ఆ త‌ర్వాత మీ  డేటాను కూడా కాపీ చేసుకుని కంప్యూట‌ర్‌లో భ‌ద్రం చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు