• తాజా వార్తలు
  •  

పే ప‌ర్ డౌన్‌లోడ్ సైట్ల ద్వారా డ‌బ్బులు సంపాదించ‌డం ఎలా?

కంప్యూట‌ర్ మీట నొక్కితే.. డ‌బ్బులు సంపాదించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు.. మ‌నం దృష్టి పెట్టాలే కానీ.. కాస్త క‌ష్ట‌ప‌డాలే కానీ ఈజీ మ‌నీ ఉందిక్క‌డ‌. అయితే ఆ డ‌బ్బులు సంపాదించే మార్గాలు మాత్రం మ‌న‌కు క‌చ్చితంగా తెలుసుండాలి.  ఆ మార్గాలు స‌క్ర‌మ‌మైన‌వి, న‌మ్మ‌ద‌గిన‌వి కావాలి. ఎందుకంటే కంప్యూట‌ర్‌లో ఎన్ని లాభ‌దాయ‌క సైట్లు ఉన్నాయో.. అంత‌కంటే ఎక్కువ‌గా ఫేక్ సైట్లు ఉన్నాయి.  అయితే వాటి గురించి ఆచితూచి అడుగేయాలి. ఇంట‌ర్నెట్లో పే ప‌ర్ డౌన్‌లోడ్ సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా డ‌బ్బులు ఎలా సంపాదించాలో చూద్దాం..

ఏంటి పీపీడీ (పే ప‌ర్ డౌన్‌లోడ్ సైట్లు)
ఈ సైట్లు చాలా సింపుల్ సూత్రం మీద ప‌ని చేస్తాయి . మీరు ఒక సైట్లో అప్‌లోడ్ చేసిన ఫైల్స్‌ను ఎవ‌రైనా డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఎన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందుకు త‌గ్గ‌ట్టుగా మీకు మ‌నీ  వ‌స్తాయి. దీని వ‌ల్ల  సైట్ వాళ్ల‌కు ఉప‌యోగం ఏంటంటే మీ ఫైల్స్‌లో వాళ్లు యాడ్స్ పెట్టుకోవ‌డం, పేజ్ రిడైరెక్ట్ చేసుకోవ‌డం, స‌ర్వే యాడ్స్ వాడ‌డం లాంటి ప‌నులు చేస్తారు. మీరు బ్లాగ‌ర్ లేదా  యూట్యూబ‌ర్ అయితే మీ ఫైల్స్‌ను పీపీడీ సైట్ల‌లో పెట్టి వేల‌ల్లో డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.

ఎక్క‌డ ఉప‌యోగించాలంటే..
మీకో మంచి బ్లాగ్ ఉండి.. అది విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుంటే మీకు పీపీడీ సైట్ల‌తో ప‌ని లేదు. ఎందుకంటే పీపీడీని మించి ఆదాయాన్ని ఆ బ్లాగ్‌లు మీకు ఇస్తాయి. అయితే మీరు ఇప్పుడే బ్లాగింగ్‌లో ఎదుగుతుంటే మాత్రం ఈ సైట్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఒక‌వేళ  మీరు మంచి బ్లాగ‌ర్ అయి ఉండి కూడా ఈ సైట్ల‌ను ఉప‌యోగిస్తే మాత్రం మీ బ్లాగ్ ర్యాంకింగ్ మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంది.  గూగుల్ యాడ్‌సెన్స్‌, ఇత‌ర అఫ్లియేష‌న్స్‌తో ఉన్న‌ప్పుడు పీపీడీ మీకు వ‌ర్క్ ఔట్ కాదు.

పీపీడీ సైట్ల‌లో ర‌కాలు

స‌ర్వేల ద్వారా: ఈ సైట్  యూజ‌ర్ల‌కు స‌ర్వేలు ఇస్తుంది. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉన్న డిటైల్స్‌ను నింపాలి.  ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నందుకు స‌ర్వేలు ఫిల్ చేసినందుకు మీకు మ‌నీ వ‌స్తుంది. స‌ర్వే సైట్ల ద్వారా వ‌చ్చే డ‌బ్బులు పెద్ద మొత్తంలోనే ఉంటుంది.

స‌ర్వేలు కాకుండా: ఈ ర‌కం పీపీడీ సైట్లను మ‌నం సుల‌భంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాన‌ర్ యాడ్స్‌, రీడైరెక్ట్ వంటి వాటి వ‌ల్ల మీకు పేమెంట్స్ వ‌స్తాయి. అయితే ఈ పేమెంట్స్ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌వు.

ఫైల్ఐస్‌.నెట్‌
పే ప‌ర్ డౌన్‌లోడ్ సైట్ల‌లో ఉత్తమ‌మైన సైట్ల‌లో ఫైల్ఐస్‌.నెట్ ఒక‌టి.  ఎక్కువ‌మంది ఉప‌యోగించే పీపీడీ సైట్ల‌లో ఇదొక‌టి.  డౌన్‌లోడ్ అయ్యే ఒక్కో ఫైల్‌కు 2 డాల‌ర్ల వ‌ర‌కు మీ అకౌంట్లో చేర‌తాయి. దీనికి మీరు చేయాల్సింద‌ల్లా ఆ సైట్ పాలసీ, నిబంధ‌న‌లు పాటించ‌డ‌మే. 

షేర్ క్యాష్‌
ఆన్‌లైన్‌లో పే ప‌ర్ డౌన్‌లోడ్ సైట్ల‌లో  షేర్ క్యాష్ కూడా ఒక‌టి. మీరు ఒక్కో ఫైల్‌కు 0.15 డాల‌ర్ల నుంచి 0.30 డాల‌ర్ల వ‌ర‌కు  ఈ సైట్ ఆఫ‌ర్ చేస్తుంది. ఎన్ని ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉండే అంత డ‌బ్బులు వ‌స్తాయి. కేవ‌లం డౌన్‌లోడ్స్ మాత్ర‌మే కాదు అప్‌లోడ్స్‌కు కూడా డ‌బ్బులు ఇవ్వ‌డం ఈ సైట్ ప్ర‌త్యేక‌త‌.
                                          

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు