• తాజా వార్తలు
  •  

పేటీఎం నుంచి బ్యాంకు అకౌంట్‌కు ఫీజు లేకుండా డబ్బు ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

ఇప్పుడు ఏ అవ‌స‌రాల‌కు అయినా పేటీఎంను విరివిగా వాడుతున్నాం.  దీని కోసం మ‌నం పేటీఎం వాలెట్‌లు డ‌బ్బులు కూడా జ‌మ చేస్తాం. ఒక్కోసారి ఎక్కువ డ‌బ్బులు కూడా జ‌మ చేస్తాం. ఆ డ‌బ్బులు తిరిగి బ్యాంకు అకౌంట్‌కు పంపుకుందాం అనుకుంటే మ‌న‌కు తిరిగి ఛార్జీలు ప‌డ‌తాయి. అంటే మ‌న డ‌బ్బులు మ‌నం తీసుకోవ‌డానికి కూడా ఛార్జీలే అన్న‌మాట‌.  అయితే ఎలాంటి ఫీజులు లేకుండా.. క‌నీసం పాన్‌కార్డు కూడా వాడ‌కుండా  పేటీఎం వాలెట్ నుంచి బ్యాంకు అకౌంట్‌కు డ‌బ్బులు పంపుకోవ‌డానికి ఒక ట్రిక్‌లు ఉన్నాయి అవేంటో చూద్దాం.

రూ.100 క‌న్నా త‌క్కువ డ‌బ్బులు తీయ‌డం ఎలా?

మీ పేటీఎం వాలెట్ నుంచి రూ.100 కంటే త‌క్కువ‌గా ఉన్న డ‌బ్బుల్ని విత్‌డ్రా చేసుకోవ‌డం కుదుర‌దు. కానీ ఒక ట్రిక్ ద్వారా ఆ డ‌బ్బులు కూడా మీరు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

పేటీఎం లాగిన్ అయి వాలెట్‌లోకి వెళ్లాలి. మీ పేటీఎం వాలెట్‌లో రూ.60 లేదా రూ.40 ఉంటే ఆ డ‌బ్బుల్ని మీరు ఏ పేమెంట్ మెథ‌డ్ ద్వారానే విత్ డ్రా చేసుకోవ‌చ్చు. ఏ బిల్స్ అయినా పే చేసుకోవ‌చ్చు.

0 ఫీజుతో బ్యాంకు అకౌంట్‌కి..

1. పేటీఎం వెండ‌ర్ ఆఫ‌ర్ పేజీని ఓపెన్ చేయాలి.

2. గెట్ క్యూఆర్ కోడ్ ఇన్‌స్టంట్‌లీ మీద క్లిక్ చేయాలి

3. ఇప్పుడు పేటీఎంలో మీ అకౌంట్  ఓపెన్ చేయాలి

4. అవ‌స‌ర‌మైన అన్ని వివ‌రాలు ఇవ్వాలి.. అంతే ఈ పేటీఎం అకౌంట్ నుంచి డ‌బ్బులు బ్యాంకుకు పంపుకోవ‌డం అప్పుడు చాలా సుల‌భం.

5. దీనిలో ఏమైనా ఇబ్బందులు వ‌స్తే మీ డాక్యుమెంట్లు ఇచ్చి అకౌంట్ అప్‌డేట్ చేసుకోవాలి

1 శాతం ఫీజులో డ‌బ్బ‌లు ట్రాన్స‌ఫ‌ర్ ఎలా చేయాలంటే..

1. ముందుగా మీకో పేటీఎం అకౌంట్ ఉండాలి. పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. మీ పేటీఎం వాలెట్‌లో మ‌నీ లోడ్ చేసుకోవాలి

3. పేటీఎం మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ ఓపెన్ చేయాలి.  ఆ త‌ర్వాత పే, సెండ్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

4. బ్యాంకు అకౌంట్ వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. సెండ్ మీద క్లిక్ చేయాలి

5. అంతే మీ డ‌బ్బులు బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స‌ఫ‌ర్ అయిపోతాయి.

పేటీఎం వాలెట్ టు వాలెట్  ఫీజు లేకుండా..

1 ముందుగా పేటీఎం యాప్  ఓపెన్ చేయాలి

2. వాలెట్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. మొబైల్ నంబ‌ర్, అమౌంట్ ఎంట‌ర్ చేయాలి

3. మీ కామెంట్ ఎంట‌ర్ చేయాలి (ఆప్ష‌న‌ల్‌)

4. సెండ్ మీద క్లిక్ చేయాలి. మీ మ‌నీ వెంట‌నే వేరే పేటీఎం అకౌంట్‌కు ఎలాంటి రుసుము లేకుండా వెళిపోతాయి.

బ్యాంకుకు పండానికి నియ‌మ నిబంధ‌న‌లు

1. బ్యాంకుకు పంపాలంటే  మినిమం అమౌంట్ రూ.10,000

2. ట్రిక్‌ను ఉప‌యోగించే మినిమం రూ.100 నుంచి రూ.1 కూడా బ్యాంకుకు పంపుకోవ‌చ్చు.

3. 1 శాతం ఫీజు మాత్ర‌మే మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.

4. కొత్త పేటీఎం అకౌంట్‌దారు డ‌బ్బులు పంపేందుకు మూడురోజులు వేచి చూడాలి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు