• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్‌లో ఐఫోన్ 3డీ ట‌చ్ ఫీచ‌ర్‌ను వాడ‌డం ఎలా?

ఐఫోన్ అన్నా.. దానిలో ఉండే ఫీచ‌ర్ల‌న్నా యూత్‌కు మ‌హా క్రేజ్‌. మ‌రి ఐఫోన్ కొనాలంటే మామూలు విష‌యం కాదు. దీని ధ‌రే ఒక రేంజ్‌లో ఉంటుంది. అందుకే చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే సంతృప్తి ప‌డ‌తారు. అయితే ఒక చిన్న ట్రిక్‌తో మీరు ఐఫోన్లో ఉన్న అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అదే ఐఫోన్లో ఉన్న 3డీ ట‌చ్ ఫీచ‌ర్‌ను మీరు ఆండ్రాయిడ్‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో చూద్దాం..

ఫోర్స్ ట‌చ్ డిటెక్ట‌ర్‌
ఐఫోన్ త్రిడీ ట‌చ్ ఫీచ‌ర్‌ను అండ్రాయిడ్‌లో ఫోన్లో వాడ‌టానికి మీకు ఫోర్స్ ట‌చ్ డిటెక్ట‌ర్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంటే ఆండ్రాయిడ్ స్క్రీన్ మీద మీ వేళ్లు ఎక్క‌డ ఉన్నాయో ఈ యాప్ డిటెక్ట్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఐఫోన్ 3డీ ట‌చ్ ఫీచ‌ర్లో ఉన్న అన్ని ఆప్ష‌న్లు మీకు ఈ యాప్ ద్వారా ల‌బించ‌వు. కానీ దాదాపు ఈ ఫీచ‌ర్‌ను మీరు వాడుకునే అవ‌కాశం ఉంటుంది. ట‌చ్ సాయంతో మీ ఫేవ‌రెట్ యాప్స్‌ను అసైన్ చేయ‌డానికి మీకు ఈ ట‌చ్ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నిజానికి ఫోర్స్ డైరెక్ట‌ర్ అనేది ఒక గిట్‌హ‌బ్ ప్రాజెక్ట్‌. ఆండ్రాయిడ్ ట‌చ్ ఫీలింగ్‌ను అందించ‌డానికి దీన్ని వాడ‌తారు. ఇదో ఎక్స్‌పోజ్డ్ మాడ్యుల్‌.

3డీ ట‌చ్ ఫీచ‌ర్‌ను ఆండ్రాయిడ్లో ఎలా వాడాలంటే...
1. ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ను రూట్ చేయాలి
2. ఆ త‌ర్వాత ఎక్స్‌పోజ్జ్ ఫ్రేమ్ వ‌ర్క్‌ను మీ ఆండ్రాయిడ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఫోర్స్ డిటెక్ట‌ర్ ఎక్స్‌పోజ్డ్ మాడ్యుల్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
3. ఈ రెండు అప్లికేష‌న్లు ఇన్‌స్టాల్ చేసుకున్న త‌ర్వాత ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్ వ‌ర్క్‌ను ఓపెన్ చేయాలి.  ఆ త‌ర్వాత ఫోర్స్ డిటెక్ట‌ర్‌ను యాక్టివేట్ చేయాలి
4. ఆ త‌ర్వాత మీ ఆండ్రాయిడ్‌ను రీస్టార్ట్ చేసుకోవాలి.. ఆ త‌ర్వాత మెనూ యాప్స్ నుంచి ఫోర్స్ డిటెక్ట‌ర్‌ను ఓపెన్ చేసుకోవాలి
5. ఆ త‌ర్వాత ఫోర్స్ ట‌చ్‌, మాస్ట‌ర్ స్విచ్‌ను అనేబుల్ చేయాలి
6. త్రెషోల్డ్ ఓపెన్ చేసి స్క్రీన్‌ను ఐదుసార్లు బొట‌న‌వేలితో ట‌చ్ చేయాలి. అంతే ఆ వాల్యూ మీకు త్రెషోల్డ్‌లో కాపీ అయిపోతుంది

ఈ స్టెప్స్ అన్ని పూర్త‌యిన త‌ర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లో  ఐఫోన్ 3డీ ట‌చ్ ఫీచ‌ర్ వాడుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు