• తాజా వార్తలు

రూట్ చేసిన ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో తేజ్ యాప్‌ను ర‌న్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

పేమెంట్ యాప్స్‌లో త‌న ముద్ర చూపించాల‌ని గూగుల్ తీసుకొచ్చిన తేజ్ యాప్ ఇప్పుడు యూజ‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. రివార్డ్స్ బాగా వ‌స్తుండ‌డంతో ఎక్కువ మంది దీన్నియూజ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే ఈ యాప్ బాగా సెక్యూర్డ్‌గా ఉంది.అందుకే మీ మొబైల్ రూట్ అయి ఉంటే అందులో తేజ్ యాప్ ర‌న్ అవ‌దు. ఈ ప్రాబ్ల‌మ్‌ను క్లియ‌ర్ చేయ‌డానికి ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌రూట్ చేయాలి. అన్‌రూట్ చేయ‌డం అంటే మీ మొబైల్‌లో ఒరిజిన‌ల్ ఫైల్స్‌ను రీస్టోర్ చేయ‌డం. మీ ఫోన్ రూట్ అయి ఉండి తేజ్‌యాప్ ర‌న్ అవ‌క‌పోతే  hide My Root, Root Switch App, Isu Appలు ట్రై చేయండి. అప్ప‌టికీ ప‌ని జ‌ర‌క‌పోతేఅందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
రూట్ అయి ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్‌లో మీరు తేజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీరు లాగిన్ కాలేర‌ని వార్నింగ్ వ‌స్తుంది. ఇప్పుడు మీరు
 Hide My Root యాప్‌తో మీ మొబైల్‌ను అన్ రూట్ చేయొచ్చు. అది వర్క‌వుట్ కాక‌పోతే Unroot Zip Flash Fileను  ప్రయ‌త్నించండి. 
అన్‌రూట్ జిప్ ఫ్లాష్ ఫైల్ (Unroot Zip Flash File)
ఈ యాప్‌ను ర‌న్‌చేయాలంటే,మీరు ఫోన్‌ను Super Su Settings ద్వారా పూర్తిగా అన్‌రూట్ చేయాలి.
* UNSU.Zipను ఫ్లాష్ చేయండి.
* ఇది పూర్త‌య్యాక ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. 
* ఇప్పుడు మీ ఫోన్‌లో మీరు తేజ్ యాప్‌ను వాడుకోవ‌చ్చు.
మీ ఫోన్ రూటింగ్‌లో ఉంచే మీరు తేజ్ యాప్‌ను వాడుకోవాలంటే ఈ క్రింది ప‌ద్ధ‌తిని ఫాలో అవ్వండి
మాజిస్క్ (Magisk)
* Magisk.zipని   TWRP ద్వారా దాన్ని Flash చేయండి
* ఇప్పుడు Magisk Apkని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
3.యాప్‌ను ఓపెన్‌చేసి Menu >> Magisk hideలోకి వెళ్లండి
4. తేజ్‌యాప్ ఎక్క‌డుంతో చూసి దాని ముందున్న బాక్స్‌లో టిక్ చేయండి.
5. ఇప్పుడు తేజ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి. మీ ఫోన్ రూటింగ్‌లో ఉన్నా కూడా తేజ్ యాప్ ర‌న్ అవుతుంది.
పై రెండు ప‌ద్ధ‌తులూ మీడియాటెక్ ప్రాసెస‌ర్ ఉన్న ఫోన్ల‌కు ప‌నిచేస్తాయి. అదే మీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ ఉంటే  మూడో ప‌ద్ధ‌తిని ప్ర‌య‌త్నించండి.
స్నాప్‌డ్రాగ‌న్ డివైస్‌ను అన్‌రూట్ చేయ‌డం
1. Xposed Installerను ఓపెన్ చేసి   Uninstall >> Uninstall via Recovery కొట్టండి.ఇప్పుడు Delete Download Fileను క్లిక్ చేసి Jit on Uninstall ప్రెస్ చేయండి.
2. ఇది మీ ఫైల్‌ను అన్ఇన్‌స్టాల్ చేస్తుంది. త‌ర్వాత  Reboot ప్రెస్ చేయండి.
3. ఇప్పుడుSuper Su appను ఓపెన్ చేసి  Settingలోకి వెళ్లి Scroll Down చేసి Full unrootరి సెలెక్ట్ చేయండి.
4. దీంతో మీ ఫోన్ అన్‌రూట్ అవుతుంది.
 

జన రంజకమైన వార్తలు