• తాజా వార్తలు

సైబ‌ర్ క్రైమ్‌పై కంప్ల‌యింట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

సైబ‌ర్ క్రైమ్‌ల మీద కంప్ల‌యింట్ చేయ‌డానికి చ‌ట్టం మ‌న‌కు చాలా అవ‌కాశాలు కల్పించింది. సైబ‌ర్ క్రైమ్‌ల్లో ఎక్కువ‌భాగం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ  (IT Act), 2000 ప‌రిధిలోకే వస్తాయి. 2008లో ఈ చ‌ట్టానికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు తెచ్చారు.
 ఏయే నేరాలు సైబ‌ర్ క్రైమ్ కిందికి వ‌స్తాయి?
    ఐటీ యాక్ట్ ఒక్క‌టే కాదు ఇండియ‌న్ పీన‌ల్ కోడ్  (IPC)  కింద కూడా సైబ‌ర్ నేరాల మీద చ‌ర్య‌లు తీసుకుంటారు.  హ్యాకింగ్, డేటా దొంగిలించ‌డం వైర‌స్ ఎటాక్స్‌, స‌ర్వీస్ ఎటాక్స్‌ను, ఇల్లీగ‌ల్ ట్యాంప‌రింగ్‌, హ్యాక్ చేసి ర్యాన్స‌మ్ వేర్ డిమాండ్ చేయ‌డం ఇవ‌న్నీ సైబ‌ర్ నేరాలే. ఐటీ యాక్ట్‌లోని సెక్ష‌న్ 6, సెక్ష‌న్ 43కింద వీటిని ప్రాసిక్యూట్ చేస్తారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఫోర్జ‌రీ చేయ‌డం, మొబైల్ సిమ్‌ను క్లోనింగ్ చేయ‌డం ఇవ‌న్నీ కూడా సైబ‌ర్ క్రైమ్సే. వీటిని ఐపీసీలోని సెక్ష‌న్ 463 నుంచి సెక్ష‌న్  471 వ‌ర‌కు సంబంధిత సెక్ష‌న్ల కిందకేసు బుక్ చేసి విచారిస్తారు.  వీటితోపాటు ఆన్‌లైన్ ట్యాంప‌రింగ్‌, చైల్డ్ లేదా ఉమెన్ ఫొటోల‌ను తీసి మార్పింగ్ చేయ‌డం, వాళ్ల‌ను న్యూడ్‌గా చిత్రీక‌రించి ఫోర్నోగ్ర‌ఫీ చేయ‌డం కూడా సైబ‌ర్ నేరాలే. యుక్త‌వ‌య‌సు కూడా రాని పిల్ల‌ల‌ను అదే వ‌య‌సున్న క్లాస్‌మేట్స్ లేదా ఫ్రెండ్స్ న్యూడ్ గా చిత్రీక‌రించ‌డం, అస‌భ్యంగా ఫొటోలు తీసి సెక్సువ‌ల్‌గా హెరాస్ చేయ‌డం, వాళ్ల‌తో పోర్న్ చిత్రీక‌రించ‌డం చేసినా వాళ్ల వ‌య‌సుతో సంబంధం లేకుండా యాక్ష‌న్ తీసుకునేందుకు ఈ యాక్ట్ కింద యాక్ష‌న్ తీసుకోవ‌చ్చు. అంతేకాదు ఇలాంటి చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ ఉన్న కంటెంట్‌ను బ్రౌజింగ్‌, డౌన్‌లోడ్, షేర్ చేయ‌డం కూడా సైబ‌ర్ క్రైం కింద‌కే వ‌స్తుంది. దీనికి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే ప్ర‌మాదం ఉంది.
ఎలా రిపోర్ట్ చేయాలి?
    ఇది కూడా మిగ‌తా నేరాల మీద రిపోర్ట్ చేసిన‌ట్లే  లోక‌ల్ పోలీస్ స్టేష‌న్ల‌లో చేయొచ్చు లేదంటే ప్ర‌త్యేకించి సైబ‌ర్ క్రైమ్ సెల్స్ ఉంటాయి. వాటిలో కంప్ల‌యింట్ చేయొచ్చు. పోలీసు స్టేష‌న్‌లో ఈ కంప్ల‌యింట్ తీసుకోక‌పోతే ఆ ప్రాంత పోలీసు క‌మిష‌న‌ర్‌కు లేదా ఎస్పీకి కంప్ల‌యింట్ ఇవ్వ‌చ్చు.
  చాలా రాష్ట్రాల్లో  E-FIR ఫైల్ చేసే అవ‌కాశం కూడా ఉంది.
  దీంతోపాటు సైబ‌ర్ క్రైమ్స్, ఉమెన్‌, చైల్డ్‌ల‌పై జ‌రిగే నేరాల‌కు సంబంధించి కంప్ల‌యింట్ రిజిస్ట‌ర్ చేయ‌డానికి మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ( Ministry of Home Affairs)  ప్ర‌త్యేకంగా ఓ వైబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేసింది.
  వీటితోపాటు  సంబంధిత కోర్టులో ప్రైవేట్ కంప్ల‌యింట్ లేదా హైకోర్టులో  రిట్ పిటిష‌న్ వేయొచ్చు.

జన రంజకమైన వార్తలు