ఆకాశంలో విమానం ఎగరాలంటే కచ్చితంగా జీపీఎస్ అవసరం. భూమి మీద నుంచి సిగ్నల్స్‌ను అందుకోవాలన్నా..సమాచారాన్ని చేరవేయాలన్నా కచ్చితంగా జీపీఎస్ టెక్నాలజీ అత్యంత అవసరం. మరి ఎగిరే ఎగిరే విమానంలో జీపీఎస్ విఫలం అయితే ఏంటి పరిస్థితి? .. విమాన సిబ్బంది ఏ టెక్నాలజీ సాయం తీసుకుంటారు?
ప్రత్యేకమైన సిస్టమ్
ప్రతి ఎయిర్‌లైన్స్‌కు జియో పొజిషినింగ్ సిస్టమ్‌తో పాటు వారికంటూ సొంతమైన నేవిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఉండే ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్) ఎయిర్‌క్రాఫ్ట్ లొకేషన్‌ను నిరంతరం ట్రాక్ చేస్తుంది. అంతే కాదు ఎయిర్‌క్రాఫ్ట్ వేగం, టర్న్ ఇవన్నింటిని ఈ నేవిగేషన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అందుకే ఒకవేళ ఏమైనా ఎయిర్‌క్రాఫ్ట్ జీపీఎస్ సిగ్నల్స్‌ను కోల్పోతే ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టమ్ మాత్రం పని చేస్తూనే ఉంటుంది. దీని వల్ల విమానం ముందుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐఎన్ఎస్ ఎంత శక్తివంతమైన టెక్నాలజీ అంటే.. ఆరు నెలల పాటు నీటి అడుగున ఉన్న సబ్‌మెరైన్‌ను కూడా ఎక్కడ ఏ స్థితిలో ఉందే తెలియజేస్తుంది.
వీవోఆర్, ఏడీఎఫ్
ఐఎన్ఎస్లలో భిన్నమైన టెక్నాలజీ వాడతారు. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా ఇది పని చేస్తూనే ఉంటుంది. జీపీఎస్ విఫలం అయినా ఐఎన్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కాదు. ఎందుకంటే దీనిలో వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్నీ డైరెక్షనల్ రేంజ్ (వీవోఆర్), ఆటోమెటిక్ డైరెక్షన్ ఫైండర్ (ఏడీఎఫ్) అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. పసిఫిక్ లాంటి అత్యంత లోతైన సముద్రాల్లో కూడా సబ్‌మెరైన్ కదలికల కోసం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. లాంగెస్ట్ రేంజ్‌లకు కూడా ఫ్రీక్వెన్సీని అందించడంలో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో పైలెట్‌కు సిగ్నల్ ప్లాబ్రమ్స్ ఉండవు. క్లిష్ట పరిస్థితుల్లోనూ విమానాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీన సమర్థంగా వాడుకోవడానికి పైలెట్‌కు అకా చార్ట్ ఇస్తారు. దీని ద్వారా మీరు దగ్గర్లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను సులభంగా కనిపెట్టొచ్చు.