• తాజా వార్తలు
  •  

ఏంటి..జియో సిమ్ కాల్ బ్లాకింగ్‌? అన్‌బ్లాక్ చేయ‌డం ఎలా?

జియో వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌కు కాలింగ్ బాధ‌లు త‌ప్పిపోయాయి. ఒక‌ప్పుడు రీఛార్జ్‌లు చేసుకోవ‌డం,  బాలెన్స్ అయిపోతే అప్పు తీసుకోవడం...లేదా ప‌క్క‌వాళ్ల ఫోన్ తీసుకోవ‌డం ఇలా చాలా సీన్లు ఉండేవి. కానీ జియో వాయిస్ కాలింగ్ వ‌చ్చాక మొత్తం ప‌రిస్థితే మారిపోయింది. బాలెన్స్ గురించి ఆలోచించ‌ట్లేదెవ‌రు. ఒక‌సారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. మూడు నెల‌ల పాటు  వాయిస్ కాల్స్‌, డేటా, ఎంఎంఎస్‌లు వ‌స్తుండ‌డంతో జ‌నం జియో సిమ్‌ల మీద ప‌డ్డారు. అయితే ఇందంతా ఒక ఎత్తైతే... జియో సిమ్‌ల‌ను ప‌ర్స‌న‌ల్ యూజ్‌కు కాకుండా ఆఫీస్ యూజ్‌కు కూడా వాడేస్తున్నార‌ట‌. దీని వ‌ల్ల జియో రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. అలాంటి సిమ్‌ల‌ను బ్లాక్ చేస్తోంది. మ‌రి టూ మ‌చ్ కాలింగ్ కార‌ణంగా సిమ్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

300 నిమిషాలు... 1200 నిమిషాలు
రోజుకు 300 నిమిషాలు.. జియో కాలింగ్ చేసుకోవ‌డానిరకి రోజు వారీ ప‌రిమితి ఇది. వారానికి ఈ ప‌రిమితి 1200 నిమిషాలుగా విధించింది రిల‌య‌న్స్‌. అయితే ప‌ర్స‌న‌ల్ అవ‌స‌రాల‌కు కాకుండా వ్యాపార, వాణిజ్య అవ‌స‌రాల‌కు కూడా జియో సిమ్‌ల‌ను వాడేస్తూ రోజు వారీ లిమిట్‌ను కూడా దాటేస్తున్నార‌ట క‌స్ట‌మ‌ర్లు.  ఇది జియో ఫెయిర్ యూసేజ్ పాల‌సీకి విరుద్ధం. అందుకే జియో అలాంటి యూజ‌ర్ల‌ను వెతికిప‌ట్టుకుని సిమ్‌ల‌ను బ్లాక్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను వృథా చేస్తున్న వారికి ఇలా శిక్ష విధిస్తోంది. 

బ్లాకింగ్ కాకుండా ఉండాలంటే...
మీరు ఎప్పుడో ఒక‌సారి రోజుకు 300 నిమిషాల క‌న్నా ఎక్కువ‌సేపు కాల్స్ వినియోగిస్తే ఫ‌ర్వాలేదు. కానీ అదే రోజూ ఇలాగే పాల‌సీని అతిక్ర‌మిస్తే మాత్రం ఆ సిమ్ నంబ‌ర్ బ్లాకింగ్ జాబితాలో ప‌డిపోతుంది. ఇలాకాకుండా ఉండాలంటే..

1. 24 గంటల్లో 300 నిమిషాల క‌న్నా ఎక్కువ కాలింగ్ చేయ‌కూడ‌దు

2. వారానికి 1200 నిమిషాల క‌న్నా ఎక్కువ‌సేపు కాల్స్ వాడ‌కూడ‌దు

అన్‌బ్లాక్ చేసుకోవాలంటే..
1. క‌స్ట‌మ‌ర్‌కేర్‌కు కాల్ చేసి మీరు జియో సిమ్‌ను ప‌ర్స‌న‌ల్ యూజ్‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తున్న‌ట్లు చెప్పాలి. మీ జియో సిమ్‌ను అన్‌బ్లాక్ చేయ‌మ‌ని వారికి చెప్పాలి

2. జియో ఇలాంటి విన్న‌పాల‌కు విలువ ఇస్తుంది. ఎందుకంటే క‌మ‌ర్షియ‌ల్ యూజ్ చేసుకునేవాళ్లు ఎవ‌రూ సిమ్ బ్లాక్ అయిన త‌ర్వాత క‌స్ట‌మ‌ర్‌కేర్‌కు ఫోన్ చేసి అన్‌బ్లాక్ గురించి అడ‌గరు. నిజంగా ప‌ర్స‌న‌ల్ యూజ్‌కు వాడుకుని  లిమిట్ క్రాస్ చేసిన‌వాళ్ల సిమ్‌ల‌ను జియో తిరిగి అన్‌బ్లాక్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు