• తాజా వార్తలు

వాట్స‌ప్ లైవ్ లొకేష‌న్ షేరింగ్ ఎలా ప‌ని చేస్తుందంటే..

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం వాట్స‌ప్‌ది అగ్రస్థానం. ఫేస్‌బుక్ నియంత్ర‌ణ‌లోకి వెళ్లాక వాట్స‌ప్ ఫీచ‌ర్లు మ‌రింత మెరుగ‌ప‌డ్డాయి. తాజాగా మ‌రో సంచ‌ల‌న ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్స‌ప్‌. అదే లైవ్ లొకేష‌న్ షేరింగ్‌. అయితే గతంలోనూ ఈ లొకేష‌న్  షేరింగ్ ఆప్ష‌న్ ఉన్నా.. ఇది ఇంకా భిన్న‌మైంది.. అంత‌కంటే ఉప‌యోగ‌క‌ర‌మైంది. మ‌రి ఈ లైవ్ లొకేషన్ షేరింగ్ ఎలా ప‌ని చేస్తుందో తెలుసుకుందామా...

ఏంటి దీని ఉప‌యోగం?
మ‌నం ఎక్కడికైనా వెళిన‌ప్పుడు లేదా అనుకోకుండా ఎక్క‌డైనా చిక్కుకుపోయిన‌ప్పుడు ఈ ఆప్ష‌న్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  అంటే మ‌నం ఎక్క‌డికి వెళుతున్నామో  ఆ వివ‌రాల‌తో లొకేష‌న్ షేర్ చేస్తే చాలు. మీరు ఎక్క‌డికి వెళుతుంది రియ‌ల్‌టైమ్‌లో మ్యాప్ రూపంలో అప్‌డేట్ అవుతుంది.  లొకేష‌న్ షేరింగ్ ఇలా చాలాసేపు వ‌ర‌కు మ‌న‌కు తెలుస్తుంది. ఒక‌వేళ అవ‌త‌లి వ్య‌క్తులు మిస్ అయిన‌ప్పుడు వెంట‌నే ట్రాక్ చేయ‌డానికి ఈ  ఆప్ష‌న్ గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ లొకేష‌న్ షేరింగ్‌ను మీరు వ‌న్ ఆన్ వ‌న్ లేదా గ్రూప్ చాట్‌లో షేర్ చేసుకోవ‌చ్చు. 

మాన్యువ‌ల్‌గా ఆపేయ‌చ్చు
ఒక‌సారి లొకేష‌న్ షేర్ చేసిన త‌ర్వాత అది లైవ్‌లోకి వెళిపోతుంది. మీ స్నేహితులు ఆ  లైవ్‌ను ఫాలో కావొచ్చు. అయితే మీకు అవ‌స‌రం ముగిసిన త‌ర్వాత కూడా ఆ లోకేష‌న్ అలాగే ఉంటే.. క‌ష్టం కాబ‌ట్టి.. మాన్యువ‌ల్‌గా ఆ లొకేష‌న్ షేరింగ్‌ని ఆపేయ‌చ్చు. దీని కోసం వాట్స‌ప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టాప్ లొకేష‌న్ షేరింగ్ ఆప్ష‌న్ ప్రెస్ చేయాలి.  టెలిగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా యాప్‌లో కూడా అచ్చంగా ఇలాంటి స‌దుపాయం ఉంది. అయితే తాజాగా వాట్స‌ప్‌లో వ‌చ్చిన ఆప్ష‌న్ మ‌రింత అప్‌డేటెడ్ . అయితే టెలిగ్రామ్‌లో ఉండే ఆప్ష‌న్ ఒక గంట మాత్ర‌మే ఉంటే.  వాట్స‌ప్ లైవ్ షేరింగ్ మాత్రం రియ‌ల్ టైమ్‌లో ప‌ని చేస్తుంది.  యాపిల్ ఐఫోన్‌లోనూ ఇలాంటి స‌దుపాయం ఉంది. అదే ఐ మెసేజ్ ఆప్ష‌న్. ఈ లై వ్ షేరింగ్ ఒక గంట వ‌ర‌కు మ‌న కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ల‌కు క‌నిపిస్తుంది.                                                                                                                                             

జన రంజకమైన వార్తలు