• తాజా వార్తలు
  •  

వాట్స‌ప్ ఫ‌ర్ బిజినెస్ భార‌త్‌కు వ‌చ్చేసింది.. ఈ అకౌంట్ సెట్ అప్ చేయ‌డం ఎలా?

భార‌త్‌లో వాట్స‌ప్ వాడ‌కం ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. కోట్లాది మంది స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు మ‌న దేశంలో. అయితే వాట్స‌ప్ అంటే కేవ‌లం మెసేజ్‌లు పంప‌డం లేదా ఫైల్స్‌, ఫొటోలు పంపుకోవ‌డం, కాల్స్ చేయ‌డం వ‌ర‌కు మాత్ర‌మే అని మ‌న‌కు తెలుసు. కానీ వాట్స‌ప్‌తో ఇంత‌కుమించి ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. తాజాగా బిజినెస్‌కు ఉప‌యోగ‌ప‌డేలా వాట్స‌ప్ ఒక ఫీచ‌ర్‌తో వ‌చ్చింది. అదే వాట్సప్ ఫ‌ర్ బిజినెస్‌. ఇటీవ‌లే ఈ ఫీచ‌ర్ భార‌త్‌లోకి అందుబాటులో వ‌చ్చింది. మ‌రి ఈ ఫీచ‌ర్‌ను సెట్ అప్ చేసుకోవ‌డం ఎలా?

ఈ యాప్‌ను ఎలా సెట్  చేయాలంటే..
1. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొత్త వెర్ష‌న్‌తో ఉన్నవాట్స‌ప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన అన్ని ప‌ర్మిష‌న్ల‌ను ముందుగానే ఇవ్వాలి. దీని వ‌ల్ల త‌మ రెగ్యుల‌ర్ వాట్స‌ప్ అకౌంట్ మాదిరిగానే.. బిజినెస్ అకౌంట్‌ను కూడా ఒకే ఫోన్ నంబ‌ర్‌తో యూజ‌ర్లు  వాడుకోవ‌చ్చు

2. మీ నంబ‌ర్ను రిజిస్ట‌ర్ చేసుకున్న త‌ర్వాత‌..బిజినెస్ అకౌంట్‌కు ఒక పేరు ఇవ్వాలి. కావాలంటే ఆ పేరును త‌ర్వాత మార్చుకోవ‌చ్చు.

3. ఒక‌సారి ఈ ప్రాసెస్ అయిపోయిన త‌ర్వాత మీ మీరు రెగ్యుల‌ర్ వాట్స‌ప్ చాట్ విండోస్‌కు రీడైరెక్ట్ అవుతారు.

4. సెట్టింగ్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మిగిలిన వివ‌రాల‌న్ని ఫిల్ చేయాలి.  లొకేష‌న్‌, బిజినెస్ కేట‌గిరి, డిస్క్రిప్ష‌న్‌, ఈమెయిల్ అడ్రెస్‌,  వెబ్‌సైట్‌, బిజినెస్ అవ‌ర్స్ ఇలా అన్ని వివ‌రాలు ఇవ్వాలి.

ఈ డిటైల్స్ ఇచ్చిన త‌ర్వాత మీరు వాట్స‌ప్ ఫ‌ర్ బిజినెస్‌ను ఉయోగించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే చాలా కంపెనీలు  ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నాయి. మేక్ మై ట్రిప్‌, బుక్ మై షో ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్‌ను కస్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చాయి. 

జన రంజకమైన వార్తలు