• తాజా వార్తలు

ఫాంట‌సీ క్రికెట్ ఆడి ఐపీఎల్ ఐపీఎల్ టిక్కెట్లు సంపాదించ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

త్వ‌ర‌లో ఐపీఎల్ వ‌స్తోంది. మ‌రి మ్యాచ్‌ల‌ను చూడాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. టీవీల్లో మ్యాచ్‌లు చూడ‌డం వేరు. స్టేడియానికి వెళ్లి నేరుగా మ్యాచ్‌ల‌ను చూస్తూ ఆస్వాదించ‌డం వేరు. మ‌రి ఐపీఎల్ టిక్కెట్లు సంపాదించ‌డం ఎలా? ప‌్ర‌స్తుతం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఐపీఎల్ టిక్కెట్లు మీకు ఉచితంగా దొరికితే! అదెలా అంటారా? ... దీనికి మార్గం ఫాంట‌సీ క్రికెట్‌!

రెండు టిక్కెట్లు ఉచితంగా..
ప్లే ఫాంట‌సీ క్రికెట్ ద్వారా మీరు ఐపీఎల్ టిక్కెట్లు పొందే అవ‌కాశం ఉంది. దీనికి మీరు చేయాల్సింది కూడా చాలా సింపుల్‌. దీనికి ఒక ఫేస్‌బుక్ ఐడీ కావాలి. ఎలాంటి ఈమెయిల్‌, మొబైల్ వెరిఫికేష‌న్ కూడా అవ‌స‌రం లేదు. మీకు స్నేహితుల స‌ర్కిల్ ఎక్కువ‌గా లేక‌పోయినా ఫ‌ర్వాలేదు. సెల్ఫ్ రిఫ‌ర‌ల్స్ ద్వారా మీరు ఈ టిక్కెట్ల‌ను సంపాదించొచ్చు. ఉచితంగా టిక్కెట్ల‌తో పాటు టీమ్ఇండియా టీష‌ర్ట్స్‌, ప్రొ మెంబ‌ర్‌షిప్‌, ప్లే లీగ్ మ్యాచ్‌లు ఆడ‌డ‌టానికి ఫ్రీ క్రెడిట్స్ కూడా పొందే అవ‌కాశం మీకుంది.  మీరు రిఫ‌ర్ చేయ‌డం వ‌ల్ల క‌నీసం రెండు ఐపీఎల్ టిక్కెట్ల‌ను మీరు పొందొచ్చు.

50 మంది స్నేహితుల‌తో రిఫ‌ర్ చేస్తే...
ప్లే ఫాంట‌సీ క్రికెట్‌కు 50 మంది స్నేహితుల‌ను రిఫ‌ర్ చేస్తే క‌నుక మీరు క‌చ్చితంగా రెండు ఐపీఎల్ టిక్కెట్ల‌ను పొందుతారు. ఈ ప్లే ఫాంట‌సీ క్రికెట్ లింక్‌ను మీ స్నేహితుల‌కు పంపినా చాలు మీకు చాలా రివార్డులు వ‌స్తాయి.  అందుకు ఏం చేయాలంటే..

1. ప్లే ఫాంట‌స‌రీ లాంచ్ ఆఫ‌ర్ లింక్‌ను ఓపెన్ చేయాలి. దీంతో మీకు 50 సైన్ అప్ బోన‌స్ క్రెడిట్స్ వ‌స్తాయి

2 ఫేస్‌బుక్ ద్వారా సైన్అప్ కావాలి.  ఇది మీకు ఎఫ్‌బీ యాప్ ప‌ర్మిష‌న్ పేజీకి తీసుకెళ్తుంది. 

3. మీ ఎఫ్‌బీ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ కావాలి. అన్ని ప‌ర్మిష‌న్స్ అలోవ్ చేయాలి

4. అంతే.. మీకో యూనిక్ రిఫ‌ర‌ల్ లింక్ క్రియేట్ అవుతుంది. మీ అకౌంట్లో అప్ప‌టికే 50 క్రెడిట్స్ క‌నిపిస్తాయి

5. ఈ లింక్‌ను వీలైనంత ఎక్కువ‌మంది స్నేహితుల‌కు పంపితే చాలు.

6 మూడు రిఫ‌ర‌ల్స్ కంప్లీట్ అయితే 100 క్రెడిట్స్‌, 10 రిఫ‌ర‌ల్స్‌కు భార‌త్ జెర్సీ వ‌స్తాయి

7. 25 రిఫ‌రల్స్‌కు 200 క్రెడిట్స్‌, 50 రిఫ‌ర‌ల్స్ పూర్త‌యితే 2 ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లు మీరు పొందొచ్చు.

జన రంజకమైన వార్తలు